ఒకే రకమైన పంట సాగు కు రైతులు స్వస్తిపలకాలి జిల్లా కలెక్టర్ డి హరిచందన

ఒకే రకమైన పంట సాగు కు  రైతులు స్వస్తిపలకాలి  జిల్లా కలెక్టర్ డి హరిచందన

బుధవారం నారాయణపేట జిల్లా మరికల్ మండలం పూసలు పహాడ్ రైతు వేదిక లో ఏర్పాటు చేసిన రైతుల అవగాహన సదస్సు లో   జిల్లా కలెక్టర్ డి హరిచందన మాట్లాడుతూ ఒకే రకమైన పంట సాగు కు  రైతులు స్వస్తిపలకలన్నారు.  రైతులు ప్రత్యామ్నాయ పంటల అయిన వేరుశెనగ, శెనగ, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఆముదము, పెసరు, మినుములు, పొద్దుతిరుగుడు, జొన్న తదితర పంటల వైపు మొగ్గుచూపాలని అన్నారు. ఒక వేల రైతు ఇంటి అవసరాల నిమిత్తం లేదా సీడ్స్ కంపెనికి గాని, రైస్ మిల్లులకు గాని నేరుగా అమ్మాలనుకునే వారు మాత్రమే వరి పంట వేసుకోవచ్చ అని మార్కెట్ ను బట్టి ధర వచ్చే అవకాశం ఉంటుందన్నారు. రైతు ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపాలని రైతులు ఏదైనా అనుమానాలు, సందేహాలు ఉంటే  నేరుగా మండల వ్యవసాయ అధికారి ని రైతులు వారి సందేహాలు నివృత్తి చేసుకోవచ్చని అన్నారు. చౌడు భూములలో ఇతర  పంటలు వేసుకొని మంచి లాభాల సంపాదించుకోవచ్చన్నారు. తక్కువ ఖర్చు తో ఎక్కువ లాభాలు సంపాదించే పంటలు చాలా ఉన్నాయని ముందు చూపు తోటి పంటలు వేస్తే కంపెనీలు ముందుకు వచ్చి పండించే పంటను కొనుగోలు చేస్తారన్నారు. Nriegs కింద సబ్సిడీ ద్వారా కూరగాయలు పండించుకోవచ్చని సూచించారు.

ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జాన్ సుధాకర్, MPDO యశోద, సర్పంచ్ రైతు సమనవేయ కమీటీ అధ్యక్షకులు వ్యవసాయ అధికారులు పంచాయతీ సెక్రటరీ, Ri తదితరులు పాల్గొన్నారు.

Share This Post