ఒక కోటి 25 లక్షల వ్యయంతో ప్రభుత్వ ప్రసూతి దావకాన హనుమకొండ నందు నిర్మించిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ టి హరీష్ రావు గారు ప్రారంభించారు.

ఒక కోటి 25 లక్షల వ్యయంతో ప్రభుత్వ ప్రసూతి దావకాన హనుమకొండ నందు నిర్మించిన తెలంగాణ డయాగ్నస్టిక్స్ హబ్ ను తెలంగాణ రాష్ట్ర ఆర్థిక, వైద్య ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మాత్యులు శ్రీ టి హరీష్ రావు గారు ప్రారంభించారు. ఇట్టి తెలంగాణ డయాగ్న స్టిక్స్ హబ్ నందు రెండు కోట్ల అరవై లక్షల వ్యయంతో కావలసిన పరికరాలను పంపిణీ చేశారు. దీని ద్వారా గ్రామీణ ప్రాంతాలలోని ప్రజలు పట్టణ ప్రాంతానికి రాకుండానే వారి సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం నకు వెళ్లినట్లయితే వారి రక్త నమూనాలను సేకరించి తెలంగాణ డయాగ్నస్టిక్స్ పంపడం ద్వారా పరీక్షలు నిర్వహించి ఫలితాలను వారి చరవానికి పంపించే ఏర్పాటు చేయబడినాయి. ఇందులో 57 రకాల పరీక్షలు లభ్యమవుతాయి. అంతేకాకుండా 2డి ఎకో, అల్ట్రా సౌండ్ స్కానింగ్, mammography, ఎక్స్రే పరీక్షలు కూడా నిర్వహించబడతాయని ప్రజలు ఈ సదుపాయాలను వినియోగించుకోవచ్చు.

ఈ కార్యక్రమంలో గౌరవ పంచాయతీరాజ్ మంత్రివర్యులు శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారు, తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ గారు, శాసనమండలి సభ్యులు పోచారం శ్రీనివాస్ రెడ్డి గారు, వరంగల్ నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు, హనుమకొండ జిల్లా ప్రజా పరిషత్ చైర్మన్ డాక్టర్ సుధీర్ కుమార్ గారు వర్ధన్నపేట ఎమ్మెల్యే శ్రీ ఆరూరి రమేష్ గారు, హనుమకొండ జిల్లా కలెక్టర్ శ్రీమతి సిక్త పట్నాయక్ గారు, వరంగల్ ఎంపీ పసునూటి దయాకర్ గారు, గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ శ్రీ రిజ్వాన్ భాషా గారు, డైరెక్టర్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ రమేష్ రెడ్డి హనుమకొండ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి సాంబశివరావు, ప్రసూతి దావాఖాన హనుమకొండ సూపరింటెండెంట్ డాక్టర్ సరళ, డాక్టర్ విజయలక్ష్మి, డాక్టర్ ఉషారాణి, హనుమకొండ డిప్యూటీ డి ఎం ఎం హెచ్ ఓ డాక్టర్ యాకుబ్ పాషా, వైద్య ఆరోగ్య శాఖ ప్రోగ్రాం అధికారులు డాక్టర్ ఉమాశ్రీ, డాక్టర్ వాణిశ్రీ, డాక్టర్ హిమబిందు, మున్సిపల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ రాజేష్, స్థానిక కార్పొరేటర్ చెన్నం మధు, బైరి లక్ష్మి, జిల్లా మాస్ మీడియా అధికారి అశోక్ రెడ్డి, ప్రభుత్వ ప్రసూతి దావకాన సిబ్బంది, పీజీ విద్యార్థులు, వైద్య ఆరోగ్యశాఖ సిబ్బంది ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Share This Post