ఒప్పంద పద్దతిలో వైద్యాధికారుల భర్తీ:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య

జనగామ, సెప్టెంబర్ 29: జాతీయ ఆరోగ్య మిషన్ ద్వారా పల్లె దవాఖానాల్లో పనిచేయుటకు 22 మంది వైద్యాధికారుల పోస్టులు ఒప్పంద పద్దతిలో భర్తీ చేయుటకు అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి పోస్టులకు ఎంబిబిఎస్ పాసై, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు నమోదయివుండాలన్నారు. ఆసక్తి కలవారు వెబ్ సైట్ https://jangaon.telangana.gov.in లో 30 సెప్టెంబర్, 2021 నుండి 12 అక్టోబర్, 2021 సాయంత్రం 5.00 లోగా దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని, పూరించిన దరఖాస్తులు సంబంధిత దృవీకరణలతో 12 అక్టోబర్, 2021 సాయంత్రం 5.00 గంటలలోగా జనగామ జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post