*ఒప్పంద పద్దతిలో స్టాఫ్ నర్స్ ల భర్తీ:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య*

*ఒప్పంద పద్దతిలో స్టాఫ్ నర్స్ ల భర్తీ:: జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య*

జనగామ, అక్టోబర్ 6: 18 నెలల శిక్షణ ఇచ్చి, జాతీయ ఆరోగ్య మిషన్ లో ప్రసూతి నిర్వహణకై 4 గురు స్టాఫ్ నర్స్ ల పోస్టులు ఒప్పంద పద్దతిలో భర్తీకి అర్హత గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సిహెచ్. శివలింగయ్య ఒక ప్రకటనలో తెలిపారు. ఇట్టి పోస్టులకు జనరల్ నర్సింగ్ డిప్లొమా/బిఎస్సి నర్సింగ్ డిగ్రీ కలిగి, తెలంగాణ మెడికల్ కౌన్సిల్ నందు నమోదయి వుండాలన్నారు. 34 సంవత్సరాల లోపు వయసున్న మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని, రిజర్వేషన్లు నిబంధనల మేరకు వర్తిస్తాయని ఆయన అన్నారు. అభ్యర్థులు మైదాన ప్రాంతాల్లో 2 సంవత్సరాలు, గ్రామీణ, గిరిజన, మారుమూల ప్రాంతాల్లో ఒక సంవత్సరం లేబర్ రూమ్ అనుభవం కల్గి ఉండాలన్నారు. ఆసక్తి కలవారు వెబ్ సైట్ https://jangaon.telangana.gov.in లో 5 అక్టోబర్, 2021 నుండి 15 అక్టోబర్, 2021 సాయంత్రం 5.00 లోగా దరఖాస్తులు డౌన్లోడ్ చేసుకొని, పూరించిన దరఖాస్తులు సంబంధిత దృవీకరణలతో 15 అక్టోబర్, 2021 సాయంత్రం 5.00 గంటలలోగా జనగామ జిల్లా వైద్య, ఆరోగ్యాధికారి కార్యాలయంలో సమర్పించాలన్నారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ సంప్రదించాలని కలెక్టర్ ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
———————————————-
జిల్లా పౌరసంబంధాల అధికారి, జనగామచే జారిచేయనైనది.

Share This Post