ఒమిక్రాన్ నివారణ చర్యలపై జరిగిన సమావేశంలో మాట్లాడుతున్న జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్. (కరీంనగర్ జిల్లా )

ఒమిక్రాన్ వేరియంట్ నివారణకు పకడ్బంది చర్యలు

ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ, మాస్క్ ధరించాలి.

మాస్కు ధరించకుంటే జరిమానా

జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్

0000
జిల్లాలో ఒమిక్రాన్ వేరియంట్ రాకుండా నివారించుటకు పగడ్బందీ చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఆర్.వి.కర్ణన్ అన్నారు.

గురువారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో ఒమిక్రాన్ వేరియంట్ రాకుండా నివారణ చర్యలపై వైద్యాధికారులు, మున్సిపల్, పంచాయతి రాజ్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు నమోదవుతున్న దృష్ట్యా జిల్లాలో కొత్తగా ఒమిక్రాన్ వేరియంట్ కేసులు రాకుండా అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకొవాలని ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ నిర్ధారణ పరిక్షలు పెంచాలని అన్నారు. కోవిడ్ హై రిస్క్ ఏరియాలలో మొబైల్ టీం ల ద్వారా కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించాలని వైద్యాధికారులను ఆదేశించారు. జిల్లాలో కోవిడ్ రెండవ డోస్ టీకా 84 శాతం పూర్తి చేశామని, మిగిలిన వారికి నెలాఖరులోగా వంద శాతం పూర్తి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కొత్త ఒమిక్రాన్ వేరియంట్ విస్తరిస్తున్న దృష్ట్యా జిల్లాలో ప్రతిఒక్కరు ఇంట్లో, బయట తప్పకుండా మాస్క్ ధరించాలని అన్నారు. వచ్చే పండుగ సీజన్ లో కోవిడ్ వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మాస్కు ధరించి వారికి పోలీస్ శాఖ జరిమానా విధిస్తుంది అని తెలిపారు.దగ్గు, జలుబు, జ్వరంతో బాధపడుతున్న వారు వెంటనే దగ్గరలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో కోవిడ్ నిర్ధారణ పరిక్షలు చేయించుకోవాలని అన్నారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన వారి కుటుంబ సభ్యులు, కాంటాక్ట్ అయిన వారిని గుర్తించి వారందరిని కోవిడ్ నిర్దారణ పరిక్షలు చేయించాలని కలెక్టర్ వైద్యాధికారులను ఆదేశించారు. అన్ని మున్సిపాలిటీలలో కోవిడ్ నివారణ చర్యలు ముమ్మరంగా నిర్వహించాలని కమిషనర్లను ఆదేశించారు. ప్రత్యేక వ్యాక్సినేషన్ క్యాంపులు, మొబైల్ వ్యాక్సినేషన్ టీంల ద్వారా రెండవ డోస్ వ్యాక్సినేషన్ వంద శాతం పూర్తి చేయాలని ఆదేశించారు.

ప్రభుత్వ ఆసుపత్రిలో కోవిడ్ రోగులకు చికిత్స అందించుటకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అన్నారు. జిల్లాలో ఆక్సిజన్ కొరత లేదని, ప్రభుత్వ ఆసుపత్రిలో ఆక్సిజన్ జనరేటర్ ప్లాంట్ ఉందని తెలిపారు. ఆసుపత్రిలోని ప్రతి బెడ్ కు ఆక్సిజన్ సరఫరా కనెక్షన్ ఇవ్వాలని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో గల బెడ్స్ కు ఆక్సిజన్ సరఫరాపై తనిఖీ చేసి అన్ని బెడ్స్ కు ఆక్సిజన్ సరఫరా ఉన్నట్లు రెండు రోజుల్లో ధృవీకరణ పత్రం సమర్పించాలని ఆదేశించారు. ప్రైవేట్ ఆసుపత్రులలో కూడా ఆక్సిజన్ కొరత లేదని అన్నారు. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ప్రతి ఒక్కరు తప్పనిసరిగా మాస్కు ధరించాలని,అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో కోవిడ్ చికిత్సకు అవసరమైన మందులు, ఇంజక్షన్లను ముందస్తుగానే నిల్వ ఉంచుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా డ్రగ్ ఇన్స్ పెక్టర్ తో కలిసి కోవిడ్ చికిత్సకు అవసరమైన మందుల కొరత లేకుండా కో-ఆర్డినేషన్ చేసుకోవాలని సూచించారు. గ్రామాలలో రెండవ డోస్ కోవిడ్ వ్యాక్సినేషన్ ఓవర్ డ్యూ ఉన్న వారిని ఎంపిడిఓలు, ఎంపిఓల సహకారంతో ఇంటింటి సర్వే చేసి వ్యాక్సిన్ తీసుకోని వారిని గుర్తించి అందరికి కోవిడ్ వ్యాక్సినేషన్ చేయించాలని ఆదేశించారు. మున్సిపాలిటీలలో గల సిబ్బంది అందరూ తప్పకుండా కోవిడ్ డబుల్ వ్యాక్సినేషన్ టీకాలు తీసుకొని ఉండాలని అన్నారు. మున్సిపల్ కమిషనర్లు, పారిశుధ్ద్య పనులను ముమ్మరం చేసి కోవిడ్ నివారణకు పటిష్టమైన చర్యలు గైకొనాలని ఆదేశించారు.

Share This Post