“ఒమిక్రాన్ ” ముప్పు పొంచి ఉంది జిల్లాలో యుద్ద ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేయాలి అర్హులందరికీ విధిగా వ్యాక్సిన్ ఇవ్వాలి డాక్టర్ల ఉదాసీన వైఖరి సరికాదు ప్రజలను చైతన్య పర్చాలి….జిల్లా కలెక్టర్ హనుమంతరావు

 

“ఒమిక్రాన్ ” ముప్పు పొంచి ఉంది

జిల్లాలో యుద్ద ప్రాతిపదికన వ్యాక్సినేషన్ చేయాలి

అర్హులందరికీ విధిగా వ్యాక్సిన్ ఇవ్వాలి

డాక్టర్ల ఉదాసీన వైఖరి సరికాదు

ప్రజలను చైతన్య పర్చాలి….జిల్లా కలెక్టర్ హనుమంతరావు

జిల్లాలో అర్హులైన ప్రతి ఒక్కరికి యుద్ధ ప్రాతిపదికన వ్యాక్సినేషన్ ఇవ్వాలని జిల్లా కలెక్టర్ హనుమంతరావు వైద్య ఆరోగ్య శాఖ అధికారులకు ఆదేశించారు.

బుధవారం సాయంత్రం కలెక్టరేట్ ఆడిటోరియంలో వైద్య ఆరోగ్య శాఖ ,పంచాయతీ రాజ్, తదితర శాఖల అధికారులతో వ్యాక్సినేషన్ పురోగతి పై సమీక్షించి దిశానిర్దేశం చేశారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఒమిక్రాన్ తో ముప్పు పొంచి ఉందని, జిల్లా లో అర్హులందరికీ 100% వ్యాక్సినేషన్ పూర్తి కావాలన్నారు. ప్రజలను చైతన్యపరచాలన్నారు. వ్యాక్సినేషన్ విషయమై మండల ప్రత్యేక అధికారులు, ఆయా అధికారులు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు.
ప్రజల ఆరోగ్యం క్షేమాన్ని మించిన పని ఏదీ లేదని, అందరూ క్షేత్ర స్థాయిలో తిరిగి ప్రజలను చైతన్యపరిచి వ్యాక్సిన్ వేయించాలన్నారు.

డాక్టర్లు ప్రత్యేక అధికారులు ఉదాసీన వైఖరితో ఉండడం సరికాదన్నారు. అన్ని ప్రభుత్వ ప్రైవేట్ కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన అందరికీ వ్యాక్సిన్ వేయడం పూర్తి కావాలని, అందుకు విద్యాశాఖ అధికారులు శ్రద్ధ తీసుకోవాలన్నారు.

మొదటి డోసు తీసుకున్న తర్వాత నిర్నీత సమయం పూర్తయిన వారికి రెండవ డోసు ఇవ్వడం పై దృష్టి సారించాలన్నారు. రెండు డోసులు తీసుకుంటేనే సురక్షితమని అవగాహన కల్పించాలన్నారు. ఆరోగ్యపరంగా జిల్లా సంక్షోభంలోకి వెళ్లకుండా జాగ్రత్త పడాలన్నారు .

జిల్లాలో అవసరమైనంత వ్యాక్సిన్ అందుబాటులో ఉందన్నారు.

పిహెచ్సి వారిగా వ్యాక్సినేషన్ పురోగతిని సమీక్షించారు. తక్కువ పురోగతి గల సంబంధిత మెడికల్ ఆఫీసర్, ఎం పి డి ఓ, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ లపై కలెక్టర్ అసంతృప్తి, ఆగ్రహం వ్యక్తం చేసారు.

మైగ్రేట్ అయిన వారి జాబితా పేర్లతో సహా ఉండాలని స్పష్టం చేశారు. ఇతర పి హెచ్ సి, ఇతర జిల్లాల్లో వ్యాక్సినేషన్ తీసుకున్న వారి జాబితా అందించాలన్నారు. తప్పుడు లెక్కలతో సరిపుచ్చ వద్దని, వాక్సినేషన్ వేయించడం ఆయా డాక్టర్లు ,అధికారుల బాధ్యత అన్నారు .

వంద శాతం వ్యాక్సినేషన్ పూర్తి చేసిన పిహెచ్సి ,గ్రామం ,వార్డ్ మండలాన్ని పూర్తి చేసినట్లు డిక్లరేషన్ చేయాలని తెలిపారు. గ్రామాల్లో సర్పంచ్ల సహకారం తీసుకోవాలని సూచించారు. పంచాయతీ సెక్రటరీ లను పూర్తి భాగస్వాములను చేయాలని
డి పీ ఓ కు ఆదేశించారు.

వ్యాక్సినేషన్ పూర్తయ్యే వరకు ఎవరికీ ఎలాంటి సెలవులు ఉండవని స్పష్టం చేశారు. గ్రామం వారిగా డ్రైవ్ చేపట్టి వారంలోగా పూర్తిచేయాలని ఆదేశించారు.

ఈ సమీక్షలో అదనపు కలెక్టర్లు వీరారెడ్డి, రాజార్శి షా, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డి పి ఓ సురేష్ మోహన్, డిఎంఅండ్హెచ్ఓ గాయత్రీ దేవి, జిల్లా ఇమ్యూనైజేషన్ ఆఫీసర్ డా. శశాంక్, అదనపు పీడీ లు, జిల్లా అధికారులు,డి ఎల్ పి వో లు, రెవిన్యూ డివిజనల్ అధికారులు, ఎంపీడీవోలు, ఎం పి వో లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post