ఓటరు అవగాహన ,జాగృతం, ఓటు ప్రాముఖ్యత తెలియచేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రిపోర్టర్లకు జాతీయ మీడియా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం – తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్.

ఓటరు అవగాహన ,జాగృతం, ఓటు  ప్రాముఖ్యత తెలియచేయడంలో ఉత్తమ ప్రతిభ కనబర్చిన రిపోర్టర్లకు జాతీయ మీడియా అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం – తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్.

2012 నుండి ఇప్పటి వరకు  మీడియా ద్వారా ప్రింట్ మీడియా,ఎలక్ట్రానిక్ మీడియా,ఎలక్ట్రానిక్ రేడియో మిడియ లేదా ఆన్లైన్ సోషల్ మీడియా ద్వారా ఓటరు నమోదు పై అవగాహన, ఓటు యొక్క ప్రాధాన్యత, ఓటు సద్వినియోగం పై కల్పించిన ప్రచారానికి సంబంధించి మీడియా ప్రతినిధులు చేసిన కృషికి  జాతీయ మీడియా అవార్డు ఇవ్వనున్నట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి శశాంక్ గోయల్ ఒక ప్రకటనలో తెలిపారు.   వివిధ మీడియా, సోషల్ మీడియాలో పని చేస్తూ  2012 నుండి 2021 వరకు తాము ఓటరు అవగాహన, ప్రజాస్వామ్యం లో ఓటు  యొక్క ప్రాముఖ్యత, ఎన్నికలు పారదర్శకంగా జరిగేందుకు   రాసిన ప్రెస్ క్లిప్పింగ్స్, వీడియోలు అయితే పెన్ డ్రైవ్ రూపంలో సమర్పిస్తూ ఈ నెల 14వ తేదీ లోగా నేరుగా ఎన్నికల కమిషన్ కు దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు.  దరఖాస్తు చేసుకునేందుకు చిరునామా : శ్రీ పవన్ దివాన్, అండర్ సెక్రెటరీ ( కమ్మ్యూనికేషన్), ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా, నిర్వాచన్ సదన్, అశోక్ రోడ్, న్యూ ఢిల్లీ – 110001 కు పంపించుకోవాలి.   మరింత సమాచారం కొరకు media-division@eci.gov.in  కు గాని ఫోన్ నెం. 011-23052133 కి సంప్రదించాలని తెలిపారు.

Share This Post