ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో ఆధునీకరించుకొని 2021 నవంబరులో ప్రచురించబడే డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి ఓటరు జాబితాలో సవరణలను సరిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా॥శశాంక గోయల్ తెలిపారు.

ప్రచురణార్ధం

సెప్టెంబరు 18 ఖమ్మం:

ఓటరు జాబితాను పూర్తిస్థాయిలో ఆధునీకరించుకొని 2021 నవంబరులో ప్రచురించబడే డ్రాఫ్ట్ పబ్లికేషన్ నాటికి ఓటరు జాబితాలో సవరణలను సరిచేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా॥శశాంక గోయల్ తెలిపారు. శనివారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో పలు జిల్లాల్లో నూతనంగా నిర్మితమవుతున్న ఈ.వి. ఎం గోదాముల పనుల పురోగతి, ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులకై అందిన క్లయిమ్ పరిష్కార పురోగతి, లాజికల్ ఎర్రర్స్ నూతన ఓటరు కార్డుల పంపిణీ, 2022 ఓటరు జాబితా స్పెషల్ సమ్మరీ రివిజన్, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు ప్రతిపాదనలు, స్వీప్ కార్యక్రమాల నిర్వహణ, జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటు తదితర అంశాలపై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా॥ శశాంక గోయల్ జిల్లాల వారీగా సమీక్షించి జిల్లా కలెక్టర్లకు పలు సూచనలు చేసారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆయా జిల్లాలో చేపడ్తున్న నూతన ఈ.వి.ఎం గోదాముల నిర్మా ణాలు పనులు వారం రోజులలోగా పూర్తయ్యాలా జిల్లా కలెక్టర్లు సత్వర చర్యలు చేపట్టాలని సూచించారు. 2021. నవంబరు 1న ప్రచురించనున్న సమీకృత రాష్ట్ర ఎలక్టోరల్ రోల్ కంటే ముందస్తుగానే ఫోటో ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు, చేర్పులను సవరించాలని, మరణించిన వారి పేర్లను తొలగించడం ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళిన ఓటర్ల పేర్లను మార్పు చేయడం నూతన ఓటరుగా నమోదుకు అందిన క్లయిమ్లకు సంబంధించి ఫారం 6, 6 ఏ, 7,8, 8-ఏ లను సత్వరమే పరిష్కరించి పూర్తిస్థాయిలో ఫోటో ఓటరు జాబితాను సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నిల అధికారి సూచించారు. దీనితో పాటు ఆయా జిల్లాలో ఏమైనా పోలింగ్ కేంద్రాల మార్పులు, నూతన పోలింగ్ కేంద్రాల ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలను వెంటనే సమర్పించాలని ఆయన సూచించారు. జనవరి-2022లో ప్రచురితయ్యో ఫోటోఓటరు తుదిజాబితాలో 18 సంవత్సరాల వయస్సు పైబడిన వారందరూ ఓటరుగా నమోదు అయ్యోందుకు స్వీప్ కార్యక్రమాలను విస్తృత స్థాయిలో చేపట్టాలని అందుకు గాను జిల్లా స్థాయి కమిటీల ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నకల అధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఇప్పటికే ఓటరుగా నమోదైన వారందరికి నూతన ఫోటో ఓటరు కార్డుల పంపిణీని త్వరగా పూర్తి చేయాలన్నారు. క్లయిమ్ల సత్వర పరిష్కారానికి గాను జిల్లా ఎన్నికల అధికారులు సంబంధిత ఈ.ఆర్.ఓలతో సమీక్షించి సత్వర పరిష్కార చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు.

జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లాలో ఓటరు జాబితాలో సవరణ ప్రక్రియను వివరిస్తూ నూతన ఓటరుగా నమోదు చేసుకున్న 11,657 మందికి గాను ఇప్పటివరకు 5892 మందికి నూతన ఓటరు గుర్తింపు కార్డులను అందించడం జరిగిందన్నారు. జిల్లాలోని ఐదు నియోజకవర్గాల పరిధిలో ఇప్పటివరకు 1445 గ్రీవెన్స్ల ల ను పరిష్కరించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. స్పీప్ కార్యక్రమాలను మరింత విస్తృతంగా చేసేందుకు గాను జిల్లా స్థాయి కమిటీ ఏర్పాటుకు ప్రతిపాదనలు సమర్పించాలని ఈ సందర్భంగా కలెక్టర్ తెలిపారు.

అదనపు కలెక్టర్ ఎన్. మదుసూథన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, ఖమ్మం, కల్లూరు రెవెన్యూ డివిజనల్ అధికారులు రవీంద్రనాథ్, సూర్యనారాయణ, స్వీప్ నోడల్ అధికారి శ్రీరామ్, కలెక్టరేట్ కార్యాలయపు పరిపాలనాధికారి మదన్ గోపాల్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు వీడియో : కాన్ఫరెన్స్ లో పాల్గొన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి కార్యాలయం, ఖమ్మం వారిచే జారీచేయనైనది.

Share This Post