ఓటరు జాబితాలో ఓటరు నమోదు, మార్పు చేర్పులకై నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమాన్ని ఓటర్లతో పాటు పొలిటికల్ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు చంపాలాల్ కోరారు

ఓటరు జాబితాలో ఓటరు నమోదు, మార్పు చేర్పులకై నిర్వహిస్తున్న  స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమాన్ని ఓటర్లతో పాటు పొలిటికల్ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు చంపాలాల్  కోరారు.  శనివారం మద్యాహ్నం ఎలక్టరల్ రోల్ అబ్జార్వర్ చంపాలాల్ కలెక్టర్ డి హరిచందన తో కలిసి ఉట్కూర్ మండల్ తోప్రాస్ పల్లి గ్రామా పంచాయతి మండల పరిషత్ ప్రాథమిక ఉన్నత పాటశాలలో కల 25,26 పోలింగ్ భుత్ లను పరిశీలించారు. ముందుగ మరికల్ గ్రామం లో గల  జిల్లా పరిషత్  ఉన్నత పాఠశాలలోని పోలింగ్ బూత్ నెం.241,242,243,245,246,247,248,249 లను  పరిశీలించారు. అనంతరం ధన్వాడ మండలకేంద్రం మండలం కంసంపల్లీ గ్రామం లోని పియస్. నెం 220, 221 222, 223, 224, 225, 226, 227, 228, 229 మరియు 237 పోలింగ్ భుత్ లను పరిశించారు. అనతరం కలెక్టరేట్  సమావేశమందిరం లో  ఏర్పాటు చేసిన అఖిల పక్ష పార్టీ సమావేశంలో పాల్గొని మాట్లాడారు.  ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరి రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను సవరణ చేస్తూ ఉంటుందన్నారు.  ఎన్నికల రోజు లేదా  ముందు రోజు జాబితాలో పేర్లు గల్లంతు అయ్యాయని, మరణించిన వారి  లేదా  స్థానికేతరుల పేర్లు జాబితాలో ఉన్నాయని ఫిర్యాదులు వస్తుంటాయన్నారు.  అప్పటికే ఎన్నికల సంఘం ఆన్ లైన్ పోర్టల్ లో జాబితా ఉంచి ఉంటుందని అప్పడు లెవనెత్తని సమస్యలు ఎన్నికల రోజున లెవనెత్తడంతో ఎన్నికల కమిషన్ ఏమి చేయలేని పరిస్థితితో పాటు ఫిర్యాదులను కొట్టిపారేస్తుందన్నారు.  అందువల్ల స్పెషల్ సమ్మరి రివిజన్ ను అన్నీ పొలిటికల్ పార్టీలు ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.  జాబితాలో తొలగించాల్సిన పేర్లు ఉంటే ఫారం 7 లో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త ఓటరు నమోదుకై ఫారం 6 ద్వారా దరఖాస్తు చేరుకోవాలని సూచించారు.  జాబితా పారదర్శకంగా ఉండేందుకు పొలిటికల్ పార్టీ తరపున ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బూత్ లెవల్ అసిస్టెంట్ ను నియమించుకోవాలని  సూచించారు.  బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ లు  సమన్వయంతో పని చేసి తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు.   ఈ నెల ఒకటవ తేదీన  జిల్లాలోని  అసెంబ్లీ ఓటరు ముసాయిదా జాబితాను ప్రచురించి అభ్యంతరాల స్వీకరణ కై అన్ని పోలింగ్ బూత్ లలో జాబితా పెట్టడం జరిగిందన్నారు.  అన్ని పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి  బూత్ లెవల్ అధికారులకు సహకరించాలని సూచించారు.  వచ్చిన ఆన్ లైన్ ఆఫ్ లైన్ దరఖాస్తులను ఎప్పటికపుడు ఈ.ఆర్.ఓ నెట్ లో అప్డేట్ చేస్తూ దరఖాస్తుల పరిశీలనకు బి.ఎల్.ఓ లను పంపించాలని ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు.  బూత్ లెవల్ అధికారులకు మరోసారి శిక్షణ ఇవ్వాలని ఏ దరఖాస్తు ఎందుకు ఉపయోగపడుతుంది, వాటిని క్షేత్రస్థాయిలో ఎలా పరిశీలించాలి అనే అంశాలను అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించాలన్నారు.  అంతకు ముందు పోలింగ్ బూత్ లను పరిశీలించిన అబ్జర్వర్ బి.ఎల్.ఓ లతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.  బి.ఎల్.ఓ రిజిస్టర్, ముసాయిదా జాబితాను పరిశీలించారు.  ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇల్లిల్లు తిరుగుతున్నారా , ఏ సమస్యలు ఉన్నాయి అని ఆరా తీశారు.

జిల్లా కలెక్టర్ డి హరిచందన  మాట్లాడుతూ ముసాయిదా జాబితా ముద్రించి అన్ని పోలింగ్ బూత్ లలో ఉంచడమే కాకుండ రెండు రోజుల పాటు బి.ఎల్.ఓ లు పి.ఎస్ లో కూర్చొని ఫిర్యాదులు, దరఖాస్తులు స్వీకరించే విధంగా ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.  బి.ఎల్.ఓ లకు మరోసారి శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు.  పొలిటికల్ పార్టీలతో సమన్వయం చేసుకొని ఓటరు జాబితాను సిద్ధం చేయడం జరుగుతుందని తెలియజేసారు. పొలిటికల్ పార్టీ లు మరియు ప్రజలకు ఎలాంటి సందేహాలు ఉన్న అబ్జేర్ వరకు 915428910నెంబర్ కు మెసేజ్ ద్వార తెలపవచాన్ని కలక్టరేట్ లో ఓ టోల్ ఫ్రీ నెంబర్  08506 282282, 9154283906 ను కూడా ఏర్పాటు చేయడం జరిగినదాన్ని జిల్లా కలెక్టర్ తెలిపారు.

ఈ సమావేశంలో అన్ని పొలిటికల్ పార్టీల ప్రతినిధులతో పాటు ఆర్డీవో వెంకటేశ్వర్లు , ఏఓ నర్సింగ్ రావు, రాణి,  తదితరులు పాల్గొన్నారు.

Share This Post