ఓటరు జాబితాలో ఓటరు నమోదు, మార్పు చేర్పులకై నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమాన్ని ఓటర్లతో పాటు పొలిటికల్ పార్టీలు సద్వినియోగం చేసుకోవాలని ఛీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్రీమతి బాల మాయా దేవి పేర్కొన్నారు.

శనివారం నాడు హనుమకొండ కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన ఆల్ పార్టీ సమావేశానికి ఛీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్రీమతి బాల మాయా దేవి, కలక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, గోపి, మున్సిపల్ కమిషనర్ ప్రావీణ్య లు హజరయ్యారు. ఓటరు నమోదు పై ఆమే అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్బంగా ఛీఫ్ రేషనింగ్ ఆఫీసర్ శ్రీమతి బాల మాయా దేవి మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలని, జనవరి 1, 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరి రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను సవరణ చేస్తూ ఉంటుందన్నారు. జాబితాలో తొలగించాల్సిన పేర్లు ఉంటే ఫారం 7 లో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త ఓటరు నమోదుకై ఫారం 6 ద్వారా దరఖాస్తు చేరుకోవాలని సూచించారు. జాబితా పారదర్శకంగా ఉండేందుకు పొలిటికల్ పార్టీ తరపున ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బూత్ లెవల్ అసిస్టెంట్ ను నియమించుకోవాలని సూచించారు. బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ లు సమన్వయంతో పని చేసి తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు. అన్ని పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి బూత్ లెవల్ అధికారులకు సహకరించాలని సూచించారు. వచ్చిన ఆన్ లైన్ ఆఫ్ లైన్ దరఖాస్తులను ఎప్పటికపుడు ఈ.ఆర్.ఓ నెట్ లో అప్డేట్ చేస్తూ దరఖాస్తుల పరిశీలనకు బి.ఎల్.ఓ లను పంపించాలని ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు. ఏ దరఖాస్తు ఎందుకు ఉపయోగపడుతుంది, వాటిని క్షేత్రస్థాయిలో ఎలా పరిశీలించాలి అనే అంశాలను అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించాలన్నారు. రిజిస్టర్, ముసాయిదా జాబిత ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇల్లిల్లు తిరుగుతున్నారా , ఏ సమస్యలు ఉన్నాయి అని ఆరా తీశారు.
18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించుటకు కళాశాలలలో, యూనివర్సిటీలలో స్పెషల్ క్యంపైన్ నిర్వహించాలిని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, రేడియోల ద్వారా ఓటు హక్కు నమోదు పై విస్తృతంగా ప్రచారం చేయాలనీ తెలిపారు.

హనుమకొండ కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ హనుమకొండ కు సంబంధించిన రెండు నియోజక వర్గాలలో SVEEP కార్యక్రమాలు లో భాగంగా అన్ని కాలేజిలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించి వారిచే ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని తెలిపారు. ఈ నెల 27, 28 శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపెన్ నిర్వహిస్తున్నామని వివరించారు. హనుమకొండ జిల్లాలో నూతనంగా పరకాల డివిజన్ కలిసినందున ఆ డివిజన్లో ప్రత్యేక శ్రద్ద వహించినట్లు తెలిపారు. ఓటరు జాబితాలో మార్పులు, చేర్పులు చేసుకొనుటకు అవకాశం కల్పించినందున అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లేవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితాతో అందుబాటులో ఉంచి దరఖాస్తు అధికారులు స్వీకరిస్తారని ఆయన తెలిపారు.

వరంగల్ కలెక్టర్ గోపి మాట్లాడుతూ ఓటు నమోదుకు జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పిస్తున్నామని తెలిపారు.

చెక్ లిస్టు పెట్టాలని ఓటర్ కార్డునూ ఆదార్ కార్డుతో అనుసంధించాలని రాజకీయ పార్టి ప్రతినిధులు ఆమెకు విజ్ఞప్తి చేసారు.

ఈ సమావేశంలో అదనపు కలెక్టర్లు సంద్యారాణి, హరిసింగ్, ఆర్ డి ఓ వాసుచంద్ర, E.V.శ్రీనివాస్ రావు (INC), మొహమ్మద్ నెహాల్
పుల్లూరు అశోక్ (బీజేపీ), నిశాంత్, నాడెం శాంతి కుమార్ , రజనీకాంత్ (YSRCP) , ప్రభాకర్ రెడ్డి (సీపీఎం), బిక్షపతి (సీపీఐ)
కుసుమ శ్యామ్ కుమార్ (టీడీపీ) తహసిల్డార్లు, ఎన్నికల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post