Press release. 24-11-2022
ఓటరు జాబితాలో ఓటరు నమోదు, మార్పు చేర్పులకై నిర్వహిస్తున్న స్పెషల్ సమ్మరి రివిజన్ కార్యక్రమాన్ని పకడ్బంది గా నిర్వహించాలని ఎలక్టరల్ రోల్ అబ్సర్వర్ అహ్మద్ నదీమ్ పేర్కొన్నారు.
గురువారం నాడు కలెక్టరేట్ సమావేశ మందిరం లో స్పెషల్ సమ్మరి రివిసన్.-2023 పై అయన హనుమకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు రాజీవ్ గాంధీ హనుమంతు, dr. గోపీ, మున్సిపల్ కమిషనర్ కలెక్టరేట్ ప్రవీణ్యా తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశం నకు అధికారులు, రాజకీయ పార్టీ ప్రతినిధుల తో ఎ.ఈ.ఆర్ ఈ.అర్.ఓ (తహసీల్దారు) హాజరై నారు . ఓటరు నమోదు పై ఆయన అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ, సమాజంలో ప్రతి ఒక్కరు ఓటు హక్కును కలిగి ఉండాలని, జనవరి 1, 2023 నాటికీ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు కోసం తమ పేరు నమోదు చేసుకోవాలని అన్నారు. ఎన్నికల సంఘం ప్రతి సంవత్సరం స్పెషల్ సమ్మరి రివిజన్ నిర్వహిస్తూ ఎప్పటికప్పుడు ఓటరు జాబితాను సవరణ చేస్తూ ఉంటుందన్నారు. జాబితాలో తొలగించాల్సిన పేర్లు ఉంటే ఫారం 7 లో ఆన్ లైన్ లేదా ఆఫ్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. కొత్త ఓటరు నమోదుకై ఫారం 6 ద్వారా దరఖాస్తు చేరుకోవాలని సూచించారు. జాబితా పారదర్శకంగా ఉండేందుకు పొలిటికల్ పార్టీ తరపున ప్రతి పోలింగ్ బూత్ కు ఒక బూత్ లెవల్ అసిస్టెంట్ ను నియమించుకోవాలని సూచించారు.
బి.ఎల్.ఓ, బి.ఎల్.ఏ లు సమన్వయంతో పని చేసి తప్పులు లేని ఓటరు జాబితాను సిద్ధం చేసుకోవచ్చని తెలిపారు. అన్ని పొలిటికల్ పార్టీలు ప్రత్యేకంగా దృష్టి సారించి బూత్ లెవల్ అధికారులకు సహకరించాలని సూచించారు. వచ్చిన ఆన్ లైన్ ఆఫ్ లైన్ దరఖాస్తులను ఎప్పటికపుడు ఈ.ఆర్.ఓ నెట్ లో అప్డేట్ చేస్తూ దరఖాస్తుల పరిశీలనకు బి.ఎల్.ఓ లను పంపించాలని ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు. ఏ దరఖాస్తు ఎందుకు ఉపయోగపడుతుంది,… వాటిని క్షేత్రస్థాయిలో ఎలా పరిశీలించాలి…అనే అంశాలను అర్ధమయ్యే రీతిలో అవగాహన కల్పించాలన్నారు. రిజిస్టర్, ముసాయిదా జాబిత ఎన్ని దరఖాస్తులు వచ్చాయి, ఇల్లిల్లు తిరుగుతున్నారా , ఏ సమస్యలు ఉన్నాయి అని…ఆరా తీశారు.
18 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించుటకు కళాశాలలలో స్పెషల్ క్యాంపైన్ నిర్వహించాలని తెలిపారు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా, ద్వారా ఓటు హక్కు నమోదు పై విస్తృతంగా ప్రచారం చేయాలనీ తెలిపారు.
జిల్లాలో విడుదల చేసిన డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో గల అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు క్లెయిమ్స్ కు సంబంధించి దరఖాస్తులను డిసెంబర్ 8 వరకు ఆన్ లైన్ లో , లేదా బూత్ స్థాయి అధికారికి, తహసిల్దార్ కార్యాలయంలో సమర్పించాలని ఆమె స్పష్టం చేశారు. ఓటరు జాబితా లో వచ్చిన అభ్యంతరాలు, నూతన ఓటరు నమోదు దరఖాస్తులను డిసెంబర్ 9 నుండి డిసెంబర్ 26 లోపు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. చెక్ లిస్టు పెట్టాలని ఓటర్ కార్డునూ ఆదార్ కార్డుతో అనుసంధించాలని తెలిపారు.
జిల్లాలో SVEEP కార్యక్రమాలు లో భాగంగా అన్ని కాలేజిలలో ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమం నిర్వహించి వారిచే ఓటరు హెల్ప్ లైన్ యాప్ ద్వారా నమోదు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు. అన్ని పోలింగ్ కేంద్రాల్లో బూత్ లేవల్ అధికారులు ముసాయిదా ఓటరు జాబితాతో అందుబాటులో ఉంచి దరఖాస్తు అధికారులు స్వీకరిస్తారని తెలిపారు. ఓటు నమోదుకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అవగాహన కల్పించాలని తెలిపారు. గ్రామాల్లో మునిసిపాలిటీలలో ఓటర్లకు అవగాహన కల్పించాలన్నారు.. డిగ్రీ కళాశాలలో యాజమాన్యంతో మాట్లాడి అర్హులైన యువ ఓటర్లను నమోదు చేయించాలన్నారు. గత ఎన్నికలలో తక్కువగా నమోదైన పోలింగ్ శాతం బట్టి ఆయా పోలింగ్ కేంద్రాలలో ప్రత్యేక దృష్టి సారించాలన్నారు.రాజకీయ పార్టీలు ఈ కార్యక్రమం విజయవంతానికి సంపూర్ణ సహకారం అందిచలని అన్నారు.
ఆర్బన్ ఏరియాలో ఓటు నమోదు తక్కువ గా ఉందని , ఆర్బన్ ఏరియా లో ఎక్కువ నమోదు కు శ్రద్ధ వహించాలి అని అన్నారు.జిల్లా కలెక్టర్లు ప్రతీ వారం ఓటర్ నమోదు పై సమీక్ష సమావేశం నిర్వీస్తున్నారని, అధికారులు ఓటర్ నమోదు పై తగిన చర్యలు తీసుకోవాలి అని ఆదేశించారు.ఎన్నికల విధులను అధికారులు బాధ్యత యూతంగా నిర్వర్తించాలని అన్నారు.
కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు మాట్లాడుతూ అర్బన్ ఏరియా లో ఓటర్ నమోదు పెంచడానికి ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నట్లు తెలిపారు.రాజకీయ పార్టీ ప్రతినిధులతో సమీక్షించిన అంతరమే 14 పోలింగ్ స్టేషన్ లను మార్చినట్లు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా పబ్లిసిటీ కార్యక్రమాలను చేబడుతున్నట్లు తెలిపారు. ఓటర్ కార్డుల ను ఆధార్ card తో అనుసంధానం చేస్తున్నట్లు తెలిపారు.మార్పులు, చేర్పులు కొరకు 5878 అప్లికేషన్లు రాగ.. ఇందులో 3443 అప్లికేషన్స్ పరిష్కరించామని అన్నారు.
రాజకీయ పార్టీ ప్రతినిధులు మాట్లాడుతూ ఓటర్ నమోదు నూటికి నూరు శాతం కావాలి అని అన్నారు.ట్రాన్స్ జెండర్ లకు ప్రత్యేక ఓట్ హక్కు కల్పించాలని కోరారు.
ఈ సమావేశం ఎన్నికల జాయింట్ సీఈఓ రవికిరణ్ అదనపు కలెక్టర్లు సంధ్యా రాణి,శ్రీవత్స dro వాసు చంద్ర రాజకీయ పార్టీ ప్రతినిధులు E V శ్రీనివాస్ (congress )రావు అమరేదరరెడ్డి (BJP)Dr E నాగేశ్వర్ Rao( TRS)B సారయ్య (BSP)B ప్రభాకర్ రెడ్డి (CPM)శ్యామ్ (TDP)N రాజనీకాంత్ (YSRCP)ఫయాజ్ (MIM)ఉమ్మడి జిల్లా తాహసిల్దారులు, ఈ అర్ ఒ, బిఎల్ఓ లు సంబంధిత శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు.