ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి ఫారం-6

ఓటరు జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి ఫారం-6

ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ తప్పనిసరి కాదు

ఓటరు నమోదు ఫారాల్లో మార్పులు

ఆన్లైన్లో, బూత్ లెవల్ అధికారుల వద్దా నూతన ఓటర్ గా నమోదు చేసుకోవచ్చు

జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్

000000

ఓటర్ల జాబితాలో కొత్తగా పేరు నమోదు చేసుకోవడానికి ఈ సంవత్సరం నుండి జనవరి1, ఏప్రిల్1, జూలై1, అక్టోబర్1 తేదీలను ప్రామాణికంగా చేసుకుంటూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ ఆర్ వి కర్ణన్ అన్నారు.

     బుధవారం కలెక్టర్ చాంబర్లో వివిధ రాజకీయ పార్టీలతో నిర్వహించిన సమావేశంలో ఓటర్ ఫారాల్లో మార్పులపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం కొత్త ఓటర్ల కోసం దరఖాస్తు ఫారం-6, ప్రస్తుతమున్న ఓటరు జాబితాలో పేరు చేరడం/ తొలగించడం కొరకు, అభ్యంతరాలకు సంబంధించిన ఓటు దరఖాస్తు ఫారం-7, ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో నివాసం మార్పు/ నమోదుల సవరణ/, ఈ పి సి ఐ రిప్లేస్ హో మెంట్ / పిడబ్ల్యుడి గుర్తింపు కోసం ఓటరు దరఖాస్తు ఫారం-8, ఓటర్ల జాబితా ప్రమాణీకరణ ఉద్దేశం కోసం ఆధార్ సంఖ్య యొక్క సమాచార లేఖ-6బి వినియోగించాలని ఆయన తెలిపారు. ఆధార్ అనుసంధానం చేసే ప్రక్రియ తప్పనిసరి కాకపోయినప్పటికీ ఎన్నికల ప్రక్రియ అత్యంత పారదర్శకంగా ఉండాలనుకునే ప్రతి ఓటరు స్వచ్ఛందంగా ముందుకు రావాలని ఆయన సూచించారు. ఆన్లైన్ లో గాని, బూత్ లెవల్ అధికారి వద్దా కొత్తగా ఓటరు నమోదు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

     ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ జీవి శ్యాంప్రసాద్, తహసీల్దార్లు సుధాకర్, వెంకట్ రెడ్డి రాజకీయ పార్టీల నాయకులు కాంగ్రెస్ పార్టీ నుండి యం.మోహన్, బిజెపి నుండి బి రమణారెడ్డి, బహుజన్ సమాజ్ పార్టీ జి. అనిల్ కుమార్, సి పి ఐ ఎం మిల్కూరి వాసుదేవ రెడ్డి, ఏఐఎంఐఎం మహమ్మద్ అఖిల్, టీఆర్ఎస్ నుండి సాతినేని శ్రీనివాస్, టిడిపి కళ్యాడపు ఆగయ్య,, ఎలక్షన్ డి టి తదితరులు పాల్గొన్నారు.

Share This Post