ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించేందుకు సూపర్ చెక్ ఎంతో అవసరo- ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు మాణిక్ రాజ్ కన్నన్

ఓటరు జాబితాలో తప్పులు లేకుండా రూపొందించేందుకు సూపర్ చెక్ ఎంతో అవసరమని ఎన్నికల ఓటరు జాబితా పరిశీలకులు మాణిక్ రాజ్ కన్నన్ అన్నారు. 2022 స్పెషల్ సమ్మరి రివిజన్ ఓటరు జాబితా రూపొందించడంలో భాగంగా నాగర్ కర్నూల్ ఎలక్టరోల్ రోల్ అబ్జర్వర్ మాణిక్ రాజ్ మంగళవారం కలెక్టరేట్ లో ఓటర్ జాబితా ఏర్పాటు పై సూపర్ చెక్ చేశారు. ఈ సందర్బంగా కలెక్టరేట్ సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ తో కలిసి ఈ.ఆర్.ఓ లతో సమీక్ష నిర్వహించారు. ఓటరు నమోదు లేదా మార్పు చేర్పులకు వచ్చిన దరఖాస్తులను గుడ్డిగా ఆమోదించడం లేదా తిరస్కరించడం చేయరాదని ఈ.ఆర్.ఓ లను సూచించారు. వచ్చిన దరఖాస్తును బూత్ లెవెల్ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించిన తర్వాత బి.ఏల్.ఓ సూపర్వైజర్లు 5 శాతం సూపర్ చెక్ చేయాలని సూచించారు. అదేవిధంగా ఒకే ఇంటి నుండి 10 కన్నా ఎక్కువ ఓటు నమోదుకు దరఖాస్తులు వస్తే ఏ.ఈ.ఆర్.ఓ లు సూపర్ చెక్ చేయాలని వారు సరాసరి వచ్చిన దరఖాస్తులను 10 శాతం వరకు సూపర్ చెక్ చేయాల్సి ఉందన్నారు. ఈ.ఆర్.ఓ లు సైతం 10 శాతం సూపర్ చెక్ చేయాల్సి ఉంటుందని తెలిపారు. 2022 స్పెషల్ సమ్మరి రివిజన్ లో భాగంగా నవంబర్ 1, 2021న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా పై వచ్చిన దరఖాస్తులు, ఫిర్యాదులను డిసెంబర్ 20 వరకు పరిశీలించి పరిష్కరించేందుకు తుది గడువు ఉన్నందున రెండు మూడు రోజుల్లో ప్రక్రియను పూర్తి చేసి సూపర్ చెక్ చేసి ఆన్లైన్ లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశించారు. నమోదు ప్రత్యేక ఓటర్ క్యాంప్ పెట్టగా వచ్చిన దరఖాస్తులను పరిశీలించి 20 తేదీ లోపు ఈ.ఆర్.ఓ నెట్ లో అప్లోడ్ చేయాల్సిందిగా ఆదేశించారు. జిల్లా ఓటర్ జాబితాలో 1 శాతం ఎక్కడైనా పెరుగుదల అయిందా అనేది చూసుకోవాలని అదేవిధంగా నియోజక వర్గంలో 3 శాతం పెరుగుదల లేదా ఓటరు తొలగింపు లాంటివి ఉంటే వెంటనే క్షేత్రస్థాయిలో పర్యటించి పరిశీలించాలని తెలియజేసారు. ఈ.ఆర్.ఓ లు ఎన్నికల కమిషన్ ద్వారా జారీ చేసే సర్క్యులర్ లు ఎప్పటికప్పుడు చదువుతూ వాటిని అమలు చేసేవిధంగా చర్యలు తీసుకోవాల్సి ఉంటున్నదన్నారు. ఇది ఎన్నికల సంవత్సరం కాకపోయినప్పటికిని ఓటరు జాబితాను నిబంధనలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తూ ఉండాల్సి ఉంటుందని దీనికి అనుగుణంగా బూత్ లెవల్ అధికారులు, సూపర్వైజర్లు, ఈ.ఆర్.ఓ లు పనిచేయాల్సి ఉంటుందని తెలియజేసారు.
కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ పి. ఉదయ్ కుమార్ మాట్లాడుతూ వచ్చిన దరఖాస్తులను వారం రోజుల్లో వంద శాతం పరిష్కరించాలని ఈ.ఆర్.ఓ లను ఆదేశించారు. సూపర్ చెక్ నిర్వహించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు.
ఈ సమీక్ష సమావేశంలో ఆదనపు కలెక్టర్ మను చౌదరి, అదనపు కలెక్టర్ పి. శ్రీనివాస్ రెడ్డి, ఈ.ఆర్.ఓలు , ఏ.ఈ.ఆర్.ఓ లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post