ఓటరు జాబితా ఆదారంగా జిల్లా ప్రజలందరికీ 100% వ్యాక్సిన్ అందించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ప్రచురణార్థం -1 తేదీ. 11-10-2021
ఓటరు జాబితా ఆదారంగా జిల్లా ప్రజలందరికీ 100% వ్యాక్సిన్ అందించాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, అక్టోబర్ 11: జిల్లా వ్యాప్తంగా ప్రతి గ్రామ, మండల మున్సిపల్ స్థాయిలో ఓటరు జాబితా ఆదారంగా అర్హులందరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించడంలో మండల ప్రత్యేక అధికారులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ జి. రవి అధికారులను ఆదేశించారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఐఎంఏ హాలులో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమం అనంతరం జిల్లాలో సాగుతున్న ప్రత్యేక కోవిడ్ వ్యాక్సిన్ ప్రక్రియపై అధికారులకు దిశానిర్దేశం చేసారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ప్రత్యేక అధికారులు గ్రామ, మండల మరియు మున్సిపల్ వారిగా అర్హులందరికి కోవిడ్ వ్యాక్సిన్ అందించాలన్న ఉద్దేశ్యంతో నిర్వహిస్తున్న ప్రత్యేక వ్యాక్సినేషన్ ప్రక్రియను పోలింగ్ కేంద్రం, ఓటరు జాబితా ప్రకారం 18 సంవత్సరాలు పై బడిన ప్రతి ఓక్కరికి కోవిడ్ వ్యాక్సిన్ అందజేయాలన్న సంకల్పంతో అధికారులు ముందుకు సాగాలని తెలిపారు. గ్రామపంచాయితి సెక్రటరి, వివో, అంగన్వాడి, అశా ల ద్వారా ఇంటింటి సర్వే నిర్వహించి వ్యాక్సిన్ తీసుకున్న వారి, తీసుకోవలసిన వారి వివరాలను తెలుసుకోని, వ్యాక్సిన్ పై వారికి ఉన్న అనుమానాలను నివృత్తి చేసి, వారికి అవగాహన కల్పించాలని సూచించారు. ఇంటింటి సర్వే ద్వారా 18 సంవత్సరాల పైబడిన వారందరిలో బయటి ప్రాంతాలలో వ్యాక్సిన్ తీసుకున్న వారి వివరాలను సైతం తెలసుకుని నివేదికను తయారు చేయాలని, పిహెచ్సి సెంటర్, సబ్ సెంటర్ మరియు వార్డు వారిగా దృష్టిని సారించి నిర్దేశించిన లక్ష్యాన్ని సాధించాలని పేర్కోన్నారు. నూతన సమీకృత జిల్లా కార్యాలయ సముదాయం (జిల్లా కలెక్టర్ కార్యాలయం)లో శాఖలకు కార్యాలయాలను కేటాయించడం జరిగిందని అన్నారు. వివిధ శాఖల వారిగా తాత్కాళిక ప్రాతిపధికను విధులు నిర్వహించే సిబ్బంది వివరాలను రోస్టర్ ఆదారంగా నివేదికను కార్మికశాఖలు పంపిచాలని తెలిపారు.
ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అధనపు కలెక్టర్ శ్రీమతి జె. అరుణశ్రీ, జగిత్యాల, కోరుట్ల అర్డిఓ లు శ్రీమతి అర్.డి మాదురి, టి. వినోద్ కుమార్, వివిధ శాఖల శాఖాదిపతులు పాల్గోన్నారు.

జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post