ఓటరు జాబితా తయారీ పై సమీక్ష నిర్వహించిన ఎన్నికల రొల్ పరిశీలకులు


18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు – ఓటర్ల నమోదుకు తేదీ6,7,27,28 లలో ప్రత్యేక శిబిరాల నిర్వహణ:: ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు వీరబ్రహ్మయ్య ఐ. ఏ.ఎస్.(సహకార శాఖా కమిషనర్)
1 జనవరి 2022 నాటికి అర్హత కల్గిన ప్రతి ఒక్కరిని నమోదు చేయాలి
మరణించిన వారి పేర్లను జాబితా నుండి తొలగించాలి
ఓటరు జాబితా రూపకల్పన, అంశం పై అన్నిరాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం నిర్వహించిన ఎలక్టోరల్ రోల్ పరీశీలకులు
పెద్దపల్లి,నవంబర్ 05
:– 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పిస్తూ పకడ్భందిగా రుపొందించాలని ఎలక్టోరల్ రోల్ పరిశీలకులు ఎం.వీర బ్రహ్మయ్య ఐ. ఏ.ఎస్.(సహకార శాఖా కమిషనర్) సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒటరు ధృవీకరణ , ఒటరు జాబితా తయారీ , వంటి పలు అంశాల పై ఆయన కలెక్టరేట్ లోని సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ తో కలిసి అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేయాలని తెలిపారు ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నవంబర్ 1, 2021 న ముసాయదా ఒటరు జాబితా విడుదల చే సామని, నవంబర్ 30,2021 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వికరించి, డిసెంబర్ 20,2021లోగా అభ్యంతరాలను ,ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5,2022 న తుది ఓటరు జాబితా రుపోందించాలని తెలిపారు మరణించిన వ్యక్తుల పేర్లు, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వ్యక్తుల పేర్లను ఓటరు జాబితా నుండి తొలగించాలని అధికారులకు ఆయన సూచించారు

 ఈ సమావేశంలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ డాక్టర్ సంగీత సత్యనారాయణ మాట్లాడుతూ

ఓటరూ జాబితా లో అర్హులైన ఓటర్ల ను నమోదు చేయుటకు జిల్లాలో నవంబర్ 6,7 మరియు నవంబర్ 27,28 తేదిలలో ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో బూత్ స్థాయి అధికారి ఆధ్వర్యంలో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేస్తున్నామని కలెక్టర్ తెలిపారు ఇట్టి అవకాశాన్ని అర్హులైన ఓటర్లు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ తెలిపారు.

పెద్దపల్లి రెవెన్యూ డివిజన్ అధికారి శంకర్ కుమార్, మంథని రెవెన్యూ డివిజన్ అధికారి కె.నరసింహమూర్తి,డి.సి.ఓ. మైకేల్ బోస్ ,ఎన్నికల డిటి ప్రవీణ్ కుమార్, తెరాస పార్టి ప్రతినిధి నారాయణదాసు మారుతి, కాంగ్రెస్ కొమ్మురయ్య, తెదెపా ప్రతినిధి వినాయక్ రావు, భాజాపా ప్రతినిధి వేణుగోపాల్, బిఎస్పీ ప్రతినిధి మహెష్ కుమార్, సిపిఐ ప్రతినిధి సదానందం,  సంబంధిత అధికారులు, తదితరులు ఈ సమావేశంలో పాల్గోన్నారు.

Share This Post