ఓటరు జాబితా రూపకల్పనలో అప్రమత్తంగా ఉండాలి:: జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా

ప్రచురణార్థం……1

తేదీ.26.11.2022

100% పారదర్శకంగా క్షేత్రస్థాయి విచారణ చేపట్టాలి

చిన్న చిన్న పొరపాట్లతో భారీ మూల్యం చెల్లించాల్సి ఉంటుంది

ప్రతి పోలింగ్ బూత్ పరిధిలో దివ్యాంగుల ఓటర్ల మ్యాపింగ్ చేయాలి

పోలింగ్ బూత్ పరిధిలో ప్రముఖులు, విఐపి ల ఓటు సరిచూసుకోవాలి

ప్రత్యేక ఓటర్ నమోదు శిబిరాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్

జయశంకర్ భూపాలపల్లి నవంబర్ 26::

జిల్లాలో ఓటరు జాబితాను ఎలాంటి చిన్న పొరపాటు సైతం రాకుండా అప్రమత్తంగా తయారు చేయాలని, లెక్కల కమిషన్ నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా సంబంధిత భూత్ లెవెల్ అధికారులకు ఆదేశించారు.

శనివారం స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలోని పలు పోలింగ్ స్టేషన్లలో ఏర్పాటుచేసిన ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఓటరు జాబితాలో నూతన ఓటరు వివరాలు నమోదు చేసేందుకు అనుసరిస్తున్న విధివిధానాలు, గరుడ యాప్ వివరాలు తదితర అంశాల పై కలెక్టర్ వివరాలు తెలుసుకునే అధికారులకు పలు సూచనలు చేశారు

నూతన ఓటరు నమోదు చేసుకున్న దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి స్థానికులకు , 18 సంవత్సరాలు నిండిన అర్హులకు మాత్రమే జాబితాలో చోటు కల్పించాలని కలెక్టర్ సూచించారు. ఆన్ లైన్ లో వచ్చే దరఖాస్తులను సైతం క్షేత్ర స్థాయిలో బూత్ సాయి అధికారులు ధరించి జాబితాలో చోటు కల్పించాలని అన్నారు.

ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో తుది ఓటరు జాబితా ప్రచురణకు ముందు ఒకటికి రెండు సార్లు ఫోటోలు, పేర్లు, ఇతర వివరాలను బూత్ స్థాయి అధికారులు సరిచూసుకోవాలని, పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న ప్రముఖులు, వి.ఐ.పి, ప్రజా ప్రతినిధుల ఓటు వివరాలు చెక్ చేయాలని అన్నారు.

ఓటరు జాబితాలో పేర్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ నిబంధనల మేరకు జరగాలని, పోలింగ్ స్టేషన్ పరిధిలో వచ్చిన. ఫారం 7 దరఖాస్తులను పరిశీలించి సదరు ఓటర్లు శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారా లేదా అనే అంశాలను క్షుణ్ణంగా విచారించి నిర్ణయం తీసుకోవాలని సూచించారు

ప్రతి పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతివారం నమోదవుతున్న నూతన ఓటరు వివరాలు, తోలగిస్తున్న ఓటరు వివరాలను రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందజేయాలని కలెక్టర్ బి.ఏల్.ఓ లను ఆదేశించారు.

పోలింగ్ స్టేషన్ పరిధిలో ఉన్న దివ్యాంగ ఓటర్ల వివరాలు చిరునామా తో మ్యాప్ చేసి పెట్టుకోవాలని, ఇక్కడ సమయంలో వారి కోసం వాహనాలు ప్రత్యేక ఏర్పాట్లు చేసేందుకు ఉపయోగపడతాయని కలెక్టర్ తెలిపారు.

ఓటరు జాబితాలో డూప్లికేట్ ఓట్లు, లాజికల్ ఎర్రర్స్ డెమోగ్రాఫిక్ ఎర్రర్స్ పూర్తి స్థాయిలో తరించాలని కలెక్టర్ సూచించారు. ప్రస్తుత పరిస్థితుల్లో దేశంలోని అనేక ప్రాంతాల్లో స్వల్ప మెజారిటీతో ఎన్నికల గెలుపోటములు మారిపోతున్నాయని, ప్రతి ఓటు చాలా కీలకంగా మారుతుందని కలెక్టర్ పేర్కొన్నారు.

బూత్ స్థాయి అధికారులు ఏ చిన్న పోరపాటు చేసేందుకు ఆస్కారం లేదని, 100% పకడ్బందీగా నిబంధనల మేరకు విధులు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు

ఈ పర్యటనలో భూపాలపల్లి తసీల్దార్ ఇక్బాల్, సంబంధించిన అధికారులు తదితరులు కలెక్టర్ వెంట ఉన్నారు.

జిల్లా పౌర సంబంధాల అధికారి , జయశంకర్ భూపాలపల్లి చే జారీ చేయనైనది.

Share This Post