ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేపట్టాలి : రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌

ఓటరు జాబితా రూపకల్పన పకడ్బందీగా చేపట్టాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక్‌ గోయల్‌ అన్నారు. శనివారం హైదరాబాద్‌ నుండి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా అదనపు కలెక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటర్ల నమోదు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని 18 సంలు నిండిన ప్రతి ఒక్కరి వివరాలు జాబితాలో నమోదు చేసేలా కార్యాచరణ అమలు చేయడం జరిగిందని, జాబితా తయారీ కార్యక్రమానికి ముందస్తుగా అక్టోబర్‌ 31, 2021 వరకు ప్రీ రివిజన్‌ కార్యక్రమాలు నిర్వహించాలని, ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్‌ పొరపాట్లు, డెమో గ్రాఫికల్‌ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని, జిల్లాలో బూత్‌ స్థాయి అధికారులు ఇంటింటి నిర్వహించిన సర్వే ఆధారంగా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగించాలని, పోలింగ్‌ కేంద్రాల వారిగా జాబితా, చిరునామాను, పోలింగ్‌ కేంద్రాల జి.ఐ.ఎస్‌. ద్వారా సేకరించి, ప్రత్యామ్నాయ పోలింగ్‌ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా
ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని, ప్రతి వయస్సుకు సంబంధించి ఎంత మంది ఉన్నారనే సమాచారంతో జాబితా తయారు చేయాలని ఆదేశించారు. నవంబర్‌ 1, 2021న ముసాయదా ఓటరు జాబితా విడుదల అవుతుందని, నవంబర్‌ 30, 2021 వరకు సదరు జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక శిబిరాలు నిర్వహించాలని, డిసెంబర్‌ 20, 2021లోగా అభ్యంతరాలను, దరఖాస్తులను పూర్తి స్థాయిలో పరిష్కరించి జనవరి 5, 2022న తుది ఓటరు జాబితా సిద్దం చేయాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పించేందకు వీలుగా విద్యాలయాలలో ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేయాలని, డిగ్రీ / వృత్తి నైపుణ్య కళాశాలలో ఎలక్టోరల్‌ లీటిరస్‌ క్లబ్‌లు ప్రారంభించాలని, ఓటరు నమోదుకు సంబంధించి ప్రతి శాసనసభ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రూపొందించి అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. జిల్లా అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌నాయక్‌ మాట్లాడుతూ 18 సం॥లు నిండిన వారికి నూతనంగా ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా ప్రత్యేక శిబిరాలు నిర్వహించడంతో పాటు మరణించిన వారి వివరాలతో చిరునామా మారిన వారు, ఒకే పేరు రెండు / మూడు ఎపిక్‌ కార్డులు కలిగిన వారి వివరాలు సేకరించి తొలగించడం / సవరించడం
చేయడం జరుగుతుందని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మంచిర్యాల, బెల్లంపల్లి రాజస్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవి, కలెక్టరేట్‌ ఎన్నికల
అధికారి శ్రీనివాస్‌ సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

మంచిర్యాల జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post