*ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలి:: ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి టి. విజయ కుమార్*

*ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమాన్ని సమర్థవంతంగా పూర్తి చేయాలి:: ఓటర్ల జాబితా పరిశీలకులు, రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి టి. విజయ కుమార్*

*ప్రచురణార్థం-2*
రాజన్న సిరిసిల్ల, నవంబర్ 23: ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2022 కార్యక్రమం సంబంధిత అధికారులు సమన్వయంతో సమర్థవంతంగా నిర్వహించి ఓటరు జాబితా ఎలాంటి తప్పులు దొర్లకుండా పూర్తి చేయాలని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ ప్రత్యేక కార్యదర్శి, రాజన్న సిరిసిల్ల జిల్లా ఓటర్ల జాబితా పరిశీలకులు టి. విజయ కుమార్ అన్నారు. మంగళవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని కలెక్టర్ చాంబర్ లో జిల్లా కలెక్టర్‌, జిల్లా ఎన్నికల అధికారి అనురాగ్ జయంతితో కలిసి, ఆర్డీవోలు, తహశీల్దార్లు, బిఎల్ఓలతో, ఓటర్ల జాబితా పరిశీలకులు ఓటర్ల జాబితా సవరణపై సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రజాస్వామ్యంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించాలంటే ఓటరు జాబితా చాలా ముఖ్యమని, 18 సంవత్సరాల వయస్సు నిండి, అర్హత గల ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకునే విధంగా విసృత ప్రచారం చేయాలని అన్నారు. ప్రత్యేక శిబిరాలు ఏర్పాటు చేసి ఓటరుగా నమోదుపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వం ఓటరు జాబితా నిర్వహణ కోసం ప్రత్యేకంగా రూపొందించిన గరుడ యాప్‌ పై బిఎల్ఓ పూర్తి అవగాహన కల్గివుండాలన్నారు. ఓటరు హెల్ప్‌లైన్‌ యాప్‌ను ప్రజల్లోకి తీసుకువెళ్ళి, వారు వినియోగించుకునే విధంగా అధికారులు చొరవ చూపాలని తెలిపారు. దరఖాస్తు ఫారాలు 6, 7, 8, 8ఎ పై ప్రజలకు అవగాహన కల్పించాలని అన్నారు. ప్రతి కళాశాలలో 18 సంవత్సరాలు నిండిన యువతీ, యువకులు తమ ఓటు హక్కు నమోదు చేసుకొనే విధంగా గోడప్రతులు, కరపత్రాల ద్వారా తెలియజేయాలని తెలిపారు. భారత ఎన్నికల నియమావళిని ప్రతి ఒక్కరు పాటించాలని, ఆయా మండలాల తహశీల్దార్లు, బూత్‌ స్థాయి అధికారులు, రాజకీయ పార్టీల నాయకుల సమన్వయంతో ఓటరు జాబితా సవరణ, నూతన ఓటరు నమోదు కార్యక్రమాలు చేపట్టాలని, ఏమైనా సమస్యలు ఉత్పన్నమైతే సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరించుకోవాలని తెలిపారు.ఈ నెల 1 డ్రాఫ్ట్‌ పబ్లికేషన్‌ చేయడం జరిగిందని, ఈ నెలాఖరు వరకు దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని, డిసెంబర్‌ 20వ తేదీ వరకు అన్ని దరఖాస్తులను పరిశీలించి, జనవరి 5వ తేదీన తుది జాబితా ప్రచురణ జరుగుతుందని తెలిపారు. అనంతరం ఓటరు జాబితా పరిశీలకులు, జిల్లా కలెక్టర్ తో కలిసి తంగళ్ళపల్లి మండలం మండేపల్లి, ఇందిరమ్మ కాలనీ లలో పర్యటించి, ఓటు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్న బాస స్నేహిత, బైరి కళ్యాణ్ సాయి ఇండ్లకు వెళ్లి, దరఖాస్తులో సమర్పించిన వివరాల ప్రకారం క్షేత్ర స్థాయిలో స్వయంగా పరిశీలించారు. అంతకుముందు సిరిసిల్ల పట్టణ పరిధిలోని రగుడు సమీపంలోని డిఆర్సిసి, ఎఫ్ఎస్టిపి ప్లాంట్లను సందర్శించారు. వీటి నిర్వహణ గురించి సిబ్బంది క్లుప్తంగా ఆయనకు వివరించారు.
ఈ కార్యక్రమంలో ఇంచార్జ్ జిల్లా రెవిన్యూ అధికారి టి. శ్రీనివాస రావు, వేములవాడ ఆర్డివో వి. లీల, తహశీల్దార్లు విజయ్ కుమార్, సదానందం, మునీందర్, సిరిసిల్ల మునిసిపల్ కమీషనర్ సమ్మయ్య, కలెక్టరేట్ ఎలక్షన్ డిటి రెహ్మాన్, బిఎల్వో లు తదితరులు వున్నారు.

Share This Post