ఓటరు జాబితా సంక్షిప్త సవరణ పెండింగ్ క్లెయిమ్లపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా॥ శశాంక్ గోయల్ తెలిపారు

ప్రచురణార్ధం

డిశంబరు, 22,ఖమ్మం:–

ఓటరు జాబితా సంక్షిప్త సవరణ పెండింగ్ క్లెయిమ్లపై సత్వర పరిష్కార చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డా॥ శశాంక్ గోయల్ తెలిపారు నూతన ఓటర్ల నమోదు, స్పెషల్ సమ్మరి రివిజన్ పెండింగ్ క్లయిమ్స్, ఓటరు హెల్ప్ లైన్, ఓటరు అవగాహన కార్యక్రమాలు, గరుడయాప్ తదితర అంశాలపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 5 జనవరి 2022 వ తేదీన తుది జాబితా ప్రచురించేందుకు పెండింగ్ క్లయిమ్స్ పరిష్కారంతో ఓటరు జాబితాను సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్లకు సూచించారు. నూతన ఓటరుగా నమోదుకు అర్హత కలిగిన వారందరిని ఓటరుగా నమోదు అయ్యే విధంగా విస్తృతంగా ఓటరు అవగాహన కార్యక్రమాలను స్వీప్ ద్వారా నిరంతరం కొనసాగించాలని సూచించారు. నూతన ఓటరుగా నమోదుకు, మార్పులు, చేర్పులకు, తొలగింపులకు సంబంధించిన పెండింగ్ క్లయిమ్లను వెంటనే పరిష్కరించాలన్నారు. గరుడయాప్ సక్రమంగా వినియోగించు కునేందుకు బూత్ లెవల్ అధికారులకు పూర్తి స్థాయిలో శిక్షణ నివ్వాలని, కొత్తగా అందిన దరఖాస్తులను ఎప్పటికప్పుడు బి. ఎల్.ఓ ల ద్వారా పరిశీలన పిదప అప్లోడ్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు.

జిల్లా కలెక్టర్ వి.పి.గౌతమ్ జిల్లాలో స్పెషల్ సమ్మర్ రివిజన్ ప్రక్రియను వివరిస్తూ జిల్లాలో ఇప్పటివరకు 26,068 క్లయిమ్లను పరిష్కరించినట్లు తెలిపారు. ఫారమ్-6 కు సంబంధించి 6254, ఫారమ్-7 కు సంబంధించి 16,648, ఫారమ్-8 కు సంబంధించి 1024 అదేవిధంగా ఫారమ్-8 ఏ కు సంబంధించిన 2140 క్లయిమ్ లను పరిష్కరించినట్లు కలెక్టర్ వివరించారు. అదేవిధంగా 51 సూపరెజ్లను పూర్తి చేయడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ, అధికారి శ్రీమతి శిరీష, రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాద్, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దశరధ్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు తదితరులు వీడియో కాన్ఫరెన్స్లో పాల్గొన్నారు.

 

Share This Post