ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2022 పకడ్బందీగా చేపట్టాలి : ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా॥ శశాంక్‌ గోయల్‌ ఐ.ఎ.ఎస్‌.

ఓటరు జాబితా సంక్షిప్త సవరణ కార్యక్రమం-2022 కార్యక్రమాన్ని సంబంధిత శాఖల అధికారుల సమన్వయంతో పకడ్బందీగా చేపట్టాలని ముఖ్య ఎన్నికల అధికారి, తెలంగాణ రాష్ట్ర ఈ.ఓ. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి డా॥ శశాంక్‌ గోయల్‌ ఐ.ఎ.ఎస్‌. అన్నారు. ఆదివారం జిల్లా కేంద్రంలోని రాజస్వ మండల అధికారి కార్యాలయ ఆవరణలో 1 కోటి 87 లక్షల రూపాయల వ్యయంతో నిర్మించిన ఈ.వి.ఎం. /వి.వి.పి.టి. గోదాములను జిల్లా కలెక్టర్‌ రాహుల్‌రాజ్‌, జిల్లా అదనపు కలెక్టర్‌ బి.రాజేశం లతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ముఖ్య ఎన్నికల అధికారి, తెలంగాణ రాష్ట్ర ఈ.ఓ. ప్రత్యేక ముఖ్య కార్యదర్శి మాట్లాడుతూ నవంబర్‌ 1వ తేదీ నుండి ఎస్‌. ఎస్‌.ఆర్‌. -2022 కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో చేసే విధంగా అధికారులు చొరవ తీసుకోవాలని, ప్రజలందరికీ వివరాలు తెలిసే విధంగా విసృత ప్రచారం నిర్వహించాలని తెలిపారు. తేది : 01-01-2022 నాటికి 18 సం॥లు నిండిన ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు నమోదు చేసుకోవడంతో పాటు రెండు / మూడు ఎపిక్‌ కలిగి ఉన్న చిరునామా మారినా, మృతి చెందిన వారి వివరాలు తొలగించడంతో పాటు పేరు, వివరాలు ఏమైనా సవరణ ఉన్నట్లయితే సరి చేసుకునే విధంగా ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు ఓటరు హెల్ప్‌లైన్‌ వివరాలు తెలిసేలా ప్రచారం చేయాలని తెలిపారు. జిల్లాలో బూత్‌ స్థాయి అధికారుల పోస్టులు ఖాలీగా ఉన్న చోట త్వరగా భర్తీ చేయాలని, బూత్‌ స్థాయి అధికారులకు గరుడ యాప్‌ నిర్వహణ వివరించాలని, కామన్‌ సర్వీస్‌ సెంటర్‌ నుండి వచ్చిన దరఖాస్తులను పరిశీలించి త్వరగా పరిష్కరించాలని అధికారులను అదేశించారు. ప్రతి పోలింగ్‌ కేంద్రంలో రాజకీయ పార్టీ నుండి ఒక ఏజెంట్‌ను నియమించాలని అన్నారు. జనవరి 5వ తేదీ వరకు నూతన ఓటర్ల నమోదు పూర్తి చేయాలని జనవరి 15వ తేదీ నాటికి తుది జాబితా తయారు చేసి సిద్దంగా ఉంచాలని తెలిపారు. అనంతరం హరితహారం కార్యక్రమంలో భాగంగా మొక్కలు నాటారు.

ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్‌, కాగజ్‌నగర్‌ రాజస్వ మండల అధికారులు దత్తు, చిత్రు, ఎన్నికల ఉప తహశిల్దార్లు
జితేందర్‌, పోచయ్య, ఆయా మండలాల తహశిల్దార్లు, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లా పౌర సంబంధాల అధికారిచే జారీ చేయడమైనది.

Share This Post