ఓటరు నమోదు కార్యక్రమం లో బాగంగా జిల్లా లో ఓటర్ జాబితాలో నమోదు చేసుకున్న వారూ ఒక ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఉంటే ఎ ఈ.ఆర్.ఓ లు తప్పని సరిగా ఫీల్డ్ విసిట్ చేసి వివరాలను తెలుసుకోవాలని ఓటరు జాబితా( ఎలక్టోరల్ రోల్) పరిశీలకులు (పరిశ్రమల శాఖ కమిషనర్) మానిక్ రాజ్ కన్నన్, ఐ ఎ ఎస్ , తెలిపారు.

పత్రికా ప్రకటన                                                             తేదీ 14.12.2021

ఓటరు నమోదు కార్యక్రమం లో బాగంగా జిల్లా లో ఓటర్ జాబితాలో నమోదు చేసుకున్న వారూ ఒక ఇంటిలో 10 మంది కంటే ఎక్కువ ఉంటే ఎ ఈ.ఆర్.ఓ లు తప్పని సరిగా  ఫీల్డ్ విసిట్ చేసి వివరాలను తెలుసుకోవాలని  ఓటరు జాబితా( ఎలక్టోరల్ రోల్) పరిశీలకులు (పరిశ్రమల  శాఖ కమిషనర్)  మానిక్ రాజ్ కన్నన్, ఐ ఎ ఎస్ , తెలిపారు.

మంగళవారం  ప్రత్యేక ఓటరు నమోదు, సవరణ కార్యక్రమంలో భాగంగా కల్లెక్టరేట్ సమావేశం హాలు నందు తహసిల్దార్లతో ఏర్పాటు చేసిన సమావేశం లో ప్రత్యేక ఓటరు  నమోదు, సవరణ, తదితర అంశాలపై సమీక్షించారు. ఈ సందర్భంగా అయన  మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఎలాంటి పొరపాట్లు  లేని ఓటరు జాబితాను రూపొందించాలని అన్నారు, ఓటర్ లకు సంబంధించిన  అభ్యంతరాలను  స్వీకరించి, ఓటర్ జాబితా లో  సవరణలు, మార్పులు, చేయాలనీ అన్నారు.   జిల్లా లో మొత్తం 2694 దరకాస్తులు వచ్చాయని,  ఏ ఇ ఆర్ ఓ లు ఒక్క శాతం, మరియు బి ఎల్ ఓ లు 5 శాతం  చెక్ చేయాలనీ,  పోలింగ్ స్టేషన్ వారిగా బి ఎల్ ఓ  ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ ఇవ్వాలని అన్నారు..   ఎన్నికల కమిషన్  గైడ్ లైన్స్ ప్రకారం  రేపటి వరకు   ఫీల్డ్ వెరిఫికేషన్ చేసి రిపోర్ట్ పంపించాలని తహసిల్దార్ లకు ఆదేశించారు.

జిల్లా అదనపు కలెక్టర్ రఘురాం శర్మ  మాట్లాడుతూ తప్పులు లేని ఓటరు జాబితా ను రూపొందించడానికి  అన్ని చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.ఫార్మ్ 6,7,8,8A లకు సంబందించిన దరకాస్తులను స్వీకరించమని తెలిపారు.

సమావేశంలో  జిల్లా అదనపు కలెక్టర్ శ్రీహర్ష,, అన్ని మండలాల తహసిల్దార్లు ,మదన్ మోహన్, సంబదిత అధికారులు ,తదితరులు  పాల్గొన్నారు.

——————————————————————————————

జిల్లా పౌర సంబంధాల అధికారి జోగులాంబ గద్వాల్  గారిచే జారీ చేయనైనది

Share This Post