ప్రచురణార్థం
ఓటరు నమోదు కార్యక్రమాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన కలెక్టర్…
మహబూబాబాద్ నవంబర్ 27.
పట్టణంలోని రైల్వే స్టేషన్ వద్ద ఉన్న ప్రభుత్వ బాలికల పాఠశాలలో ఏర్పాటు చేసిన ఓటర్ నమోదు కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ శశాంక ఆకస్మికంగా సందర్శించి పరిశీలించారు.
ఓటు హక్కు పొందేందుకు మార్పులు చేర్పులు సవరణలు వంటి వాటికి దరఖాస్తులు అందిస్తూ రికార్డులలో నమోదు చేయాలన్నారు.
ఇంటింటికి తిరిగి దరఖాస్తులు అందించే ప్రక్రియ చేపడితే ఓటుహక్కు శాతం పెంచవచ్చని అన్నారు.
కలెక్టర్ వెంట తాసిల్దార్ రంజిత్ బి ఎల్ ఓ లలిత తదితరులు ఉన్నారు.
———————-
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది