ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి :: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్

ప్రచురణార్థం-2 తేది.27.10.2021
ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి :: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్
జగిత్యాల,అక్టోబర్ 27:- ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఒటరు ధృవీకరణ , ఒటరు జాబితా తయారీ , గరుడ యాప్ వంటి పలు అంశాల పై ఆయన బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేసామని తెలిపారు. జిల్లాలో ఓటరు జాబితా నమోదు ప్రక్రియ పై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు.జిల్లాలో బూత్ స్థాయి అధికారులు ఇంటింటి నిర్వహించిన సర్వే ఆధారంగా మరణించిన వారు, ఇతర ప్రాంతాలకు తరలి వెళ్లిన వారి పేర్లను జాబితా నుండి తొలగిస్తూ వాటిని ప్రత్యేకంగా రూపొందించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జి ఐ ఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు. 18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు. నవంబర్ 1, 2021 న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేయాలని, నవంబర్ 30,2021 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వికరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని డిసెంబర్ 20,2021లోగా అభ్యంతరాలను ,ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5,2022 న తుది ఓటరు జాబితా రుపోందించాలని తెలిపారు. 18 సంవత్సరాలు నిండిన వారికి ఒటు హక్కు కల్పించేందకు వీలుగా విద్యాలయాలో ప్రత్యేక క్యాంపులు ఎర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. జిల్లాలోని డిగ్రీ/వృత్తి నైపుణ్య కళాశాలలో ఎలక్టోరల్ లీటిరస్ క్లబ్బులు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. ఒటరు నమోదు కు సంబంధించి ప్రతి అసెంబ్లీ నియోజకవర్గం వారిగా ప్రత్యేక కార్యక్రమాలు రుపొందించి అమలు చేయాలని సూచించారు. ఓటు ప్రాముఖ్యతను వివరిస్తూ జిల్లా వ్యాప్తంగా స్వీప్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని , స్విప్ కార్యక్రమాల నిర్వహణ పట్ల జిల్లా స్థాయిలో సమావెశాలు నిర్వహించాలని ఆయన సూచించారు. ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ ఓటర్ హెల్ప్ లైన్ యాప్ మరియు గరుడ యాప్ ను రుపొందించిందని, దీని పై ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. ప్రస్తుతం జరుగుతున్న హుజురాబాద్ ఉపఎన్నికలో సైతం గరుడ యాప్ వినియోగించేలా చర్యలు తీసుకోవాలని అన్నారు. గరుడ యాప్ లో పోలింగ్ స్టేషన్ వివరాలు, వాటి రూట్ మ్యాప్ సంబంధించిన పూర్తి వివరాలు అందుబాటులొ ఉంటాయని, వీటికి సంబంధించి బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు. జిల్లాలో ఉన్న ఈవిఎం గోడౌన్లను ప్రతి మాసం తనిఖీ చేయాలని ఆయన సూచించారు.

దూరదృశ్య సమీక్షలో పాల్గోన్న జిల్లా కలెక్టర్ జి. రవి మాట్లాడుతూ జిల్లాలో ప్రతి మాసం ఈవిఎం గోడౌన్ తనిఖీ చేస్తున్నామని తెలిపారు. ఓటరు జాబితా ప్రక్రియలో భాగంగా ఇప్పటి వరకు 5567 దరఖాస్తులు స్వికరించగా, 4171 పరిష్కరించామని, 915 తిరస్కరించామని, 481 పెండింగ్ లో ఉన్నాయని తెలిపారు. జిల్లాలో 105 ఎన్.జీ.ఆర్.ఎస్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను, 11 కాల్ సెంటర్ల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కరించామని తెలిపారు. జిల్లాలో స్విప్ కార్యక్రమాలో భాగంగా 232 విద్యాసంస్థలో ఎలక్ట్రికల్ క్లబ్స్ ఏర్పాటు చేసామని, 1500 చలోకరే మతదన్, 792 గరుడ యాప్ , 200 వాల్ హంగర్స్ మెటిరియల్ పంపిణీ చేసామని తెలిపారు.
అదనపు కలెక్టర్ అరుణశ్రీ, ఎన్నికల పర్యవేక్షకులు మధు, సంబంధిత అధికారులు, తదితరులు ఈ దూరదృశ్య సమీక్షలో పాల్గోన్నారు.

ఓటరు నమోదు ప్రక్రియను పకడ్బందీగా నిర్వహించాలి :: రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి శశాంక గోయల్

జిల్లా పౌరసంబంధాల అధికారి, జగిత్యాల చే జారీచేయనైనది

Share This Post