ఓటరు నమోదు ప్రక్రియ సకాలంలో పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రటన తేదిః 23-12-2202
ఓటరు నమోదు ప్రక్రియ సకాలంలో పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, డిసెంబర్ 23:

ఓటరు నమోదు ప్రక్రియ సకాలంలో పూర్తిచేయాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

ఓటరు నమోదుకు కొరకు వచ్చే ధరఖాస్తులను సకాలంలో పూర్తిచేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం సాయంత్రం రెవెన్యూ సర్వీసులపై కలెక్టర్ కార్యాలయం నుండి జూమ్ వెబ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అర్డిఓలు, తహసీల్దార్ లతో సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, డిసెంబర్ 27 లోగా ఓటరు తుదిజాబితాను రూపొందించాలని, వచ్చే ప్రతిధరఖాస్తును నిశితంగా పరిశీలించి ఓటరు జాబితాలో నమోదు చేయాలని, చనిపోయిన, చిరునామా మార్పిడి వివరాలను జాబితా నుండి తొలగించాలని అన్నారు.
కళ్యాణ లక్ష్మీ, షాదిముబారక్ కొరకు తహసీల్దార్ ల వద్దకు వచ్చే ధరఖాస్తులు పెండంగ్ లేకుండా చూసి, బడ్జెట్ ప్రకారం లబ్దిదారులకు సకాలంలో చెక్కులను అందించేలా చూడాలని అన్నారు. మండలం వారిగా వివిధ సర్టిఫికేట్ల కొరకు వచ్చే ధరఖాస్తులపై ఎప్పటికప్పుడు చర్యలు తీసుకోని సకాలంలో అందించేలా చూడాలని, కులం, ఆదాయం సర్టీఫికేట్ల జారిలో అలస్యం వలన విద్యార్థులకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉన్నందున త్వరగా చర్యలు తీసుకోవాలని, కళ్యాణలక్ష్మీ చర్యలపై రాష్ట్రంలో జిల్లా మంచిస్థానంలో ఉందని అన్నారు.
ప్రజావాణి ఫిర్యాదులు, దరణి రిజిస్ట్రేషన్ కొరకు ధరఖాస్తు చేసుకున్న వారు రిజిస్ట్రేషన్ చేయించుకోనట్లయితే వారి ధరఖాస్తును రద్దు చేసుకునే అవకాశాన్ని గురించి తెలియపరిచి వారిచే ధరఖాస్తు రద్దు చేయించాలని, కరోనాతో చనిపోయిన వారికి పరిహారం చేల్లింపులో అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలొ జగిత్యాల, కోరుట్ల ఆర్డిఓల శ్రీమతి అర్.డి. మాదురి, టి. వినోద్ కుమార్, తహసీల్దార్లు పాల్గోన్నారు.
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచేయనైనది.

Share This Post