ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలి ,మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్


ఓటరు నమోదు, సవరణ, మార్పులు, చేర్పులు ఈనెలాఖరులోగా పూర్తి చేయాలి
ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించాలి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ హరీష్
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ప్రత్యేక ఓటరు నమోదు కార్యక్రమాన్ని నిర్వహించనున్న కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ హరీష్ అన్నారు. శనివారం జిల్లా కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లాలోని ఆయా మండలాల ఆర్డీవోలు, తహశీల్దార్లు, రెవెన్యూ సిబ్బంది, వీఆర్వోలు, ఏఈఆర్వోలుతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ మాట్లాడుతూ ఓటరు జాబితాలో ఎలాంటి లాజికల్ తప్పులు లేకుండా, ఓటరు సవరణ, మార్పులు చేర్పులు వంటివి చేపట్టి ఈ నెలాఖరులోగా పరిష్కరించాలని ఆదేశించారు. నవంబర్ నాటికి డ్రాఫ్ట్ పబ్లికేషన్ జారీ చేసే ముందే చనిపోయిన, డూప్లికేట్ ఓటర్ల పేర్లు తొలగించాలని అన్నారు. పోలింగ్ కేంద్రాలను రేషనైలేజేషన్ చేస్తూ ఒక పోలింగ్ కేంద్రంలో 1,500 లకు పైగా ఓటర్లు ఉంటే అదనంగా మరో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేసేందుకు గుర్తించాలని కలెక్టర్ వివరించారు. స్వీప్ కార్యక్రమాలలో భాగంగా గ్రామా స్థాయి వరకు ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కలిగించాలని అన్నారు. జిల్లాలో గ్రామం, మండలం వారిగా క్షేత్రస్థాయిలో అధికారులు పర్యవేక్షించి ఓటరు లిస్టులో పేర్ల నమోద, వాటిలో మార్పులు, చేర్పులను చేయాల్సి ఉంటే పక్కాగా నిర్వహించాలని వివరించారు. అలాగే గ్రామాలు, వార్డుల్లో సంబంధిత అధికారులు పర్యవేక్షించిన సమయంలో ఆయా చోట్ల చనిపోయిన ఓటర్లను గుర్తించి వారి వివరాలను ఓటరు జాబితా నుండి తొలగించాలని, ఇతర ప్రాంతాలకు వలస వెళ్లిన వారి పేర్లను తొలగించే ముందు వారి కుటుంబ సభ్యులకు నోటీసులు ఇచ్చి వారం రోజుల గడువు తర్వాత పేర్లను తొలగించాలని, జాబితాలో ఫొటో తప్పుగా నమోదు అయిన వాటిపై చర్యలుతీసుకోవాలని అన్నారు. గరుడ, ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ల డౌన్ లోడ్పై బూత్ లెవల్ ఆఫీసర్లకు అవగాహన కల్పించి, యాప్ నిర్వహణపై శిక్షణ ఇవ్వాలని సూచించారు. ఎపిక్ కార్డుల డౌన్ లోడ్ చేయాలని, కొత్తగా ఓటర్లుగా నమోదయ్యేందుకు సమర్పించిన ఫారాలను సరి చూసుకోవాలని, స్పెషల్ సమ్మరి రివిజన్ పై వచ్చే ఆదేశాలను పాటించాలని సూచించారు. దీనికి సంబంధించి బూత్ లెవెల్ ఆఫీసర్లు తప్పనిసరిగా గరుడ యాప్తో పాటు ఓటర్ హెల్ప్ లైన్ యాప్లను డౌన్లోడ్ చేసుకోవాలని, ఈ యాప్ ల ద్వారానే ఓటరు జాబితాలు, పోలింగ్ కేంద్రాల వివరాలు, ఎన్నికల వివరాలు తీసుకునే వీలు ఉంటుందని జిల్లా కలెక్టర్ తెలిపారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీష్ తో పాటు జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి, జిల్లా రెవెన్యూ అధికారి లింగ్యనాయక్, జిల్లా కలెక్టరేట్ ఏవో వెంకటేశ్వర్లు, డీఈవో ప్రసాద్ , ఆయా శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Share This Post