ఓటరు సవరణ జాబితా పకడ్బందీగా నిర్వహించాలి, ప్రభుత్వ భూములను పరిరక్షించాలి – అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి

జిల్లాలో ఓటరు సవరణ జాబితా పకడ్బందీగా నిర్వహించాలని అదనపు కలెక్టర్ శ్రీనివాస్ రెడ్డి ఆర్టీవో లు, తహసీల్దార్లను ఆదేశించారు.
ఓటరు ధృవీకరణ , ఓటరు జాబితా తయారీ , గరుడ యాప్, ప్రభుత్వ భూముల పరిరక్షణ పలు అంశాల పై ఆయన బుధవారం ఆర్డీవోలుతాహసిల్దార్లుతో దూరదృశ్య సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ఆయన మాట్లాడుతూ ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని ఆ తేదీ నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా కార్యాచరణ అమలు చేసామని తెలిపారు.
ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు.
పోలింగ్ కేంద్రాల వారీగా జాబితా, అడ్రస్ ను, పోలింగ్ కేంద్రాల జి ఐ ఎస్ ద్వారా క్యాప్చరింగ్, ప్రత్యామ్నాయ పోలింగ్ కేంద్రాల ఏర్పాటు జాబితా చేపట్టిన సమాచారాన్ని సంబంధిత అధికారులు పరిశీలించాలని ఆదేశించారు.
18 సంవత్సరాలు నిండి నూతనంగా ఓటు హక్కు పొందుతున్న వారి జాబితా ప్రత్యేకంగా రూపొందించాలని, అదే సమయంలో వివిధ వయసులో గల వారి జాబితాను ప్రత్యేకంగా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.
నవంబర్ 1, 2021 న ముసాయదా ఒటరు జాబితా విడుదల చేసి, నవంబర్ 30,2021 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించామని పేర్కొన్నారు.
డిసెంబర్ చివరి నాటికి అభ్యంతరాలను ,ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5,2022 న తుది ఓటరు జాబితా రుపోందించాలని ఆయన స్పష్టం చేశారు.
ఓటర్లకు తమ పోలింగ్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ గరుడ యాప్ ను రుపొందించిందని, దీని పై ప్రజలలో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.
ప్రజల నుండి వచ్చిన దరఖాస్తులను బూత్ స్థాయి అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి గరుడ యాప్ వినియోగిస్తూ పరిష్కరించాలని, వివరాలను యాప్ లో అప్లోడ్ చేయాలని అధికారులకు ఆదేశించారు.
ఎన్నికలు ఎప్పుడు వచ్చినా నిర్వహించేలా ఓటర్ల జాబితాను రూపొందించేలా చర్యలు చేపట్టాలన్నారు.
ప్రభుత్వ భూములను పరీక్షించేలా
రెవెన్యూ యంత్రాంగం చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
అంతకుముందు రాష్ట్ర ఎన్నికల అధికారి నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో ఆయన పాల్గొన్నారు.
ఈ వీడియో కాన్ఫరెన్స్ లో కలెక్టరేట్ ఎన్నికల సెక్షన్ క్లర్కులు జ్యోతి, అశోక్ పాల్గొన్నారు

Share This Post