* ప్రచురణార్థం *
జయశంకర్ భూపాలపల్లి సెప్టెంబర్ 16 (గురువారం).
ఓటరు హెల్ప్ లైన్ మొబైల్ యాప్ పై ప్రజలందరూ అవగాహన చేసుకోవాలని దీని ద్వారా ప్రజలు తమ ఓటు హక్కు పై ఉన్న సమస్యలను నివృత్తి చేసుకోవచ్చునని జిల్లా కలెక్టర్ కృష్ణ ఆదిత్య గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.
గురువారం ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ గురించి జిల్లా కలెక్టర్ ఒక ప్రకటన విడుదలచేస్తూ భారత దేశంలో ప్రతి పౌరుడు తమ ఓటు హక్కును వినియోగించడం ద్వారా ప్రజాస్వామ్య సంరక్షణలో పాలుపంచుకుంటారని ఓటర్ ఐడిలో ఉన్న సమస్యలను నివృత్తి చేసుకోవడం కోసం ప్లేస్టోర్ ద్వారా ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ని మొబైల్ ఫోన్ లో డౌన్లోడ్ చేసుకొని మొబైల్ నెంబర్ తో లాగిన్ అవ్వాలని ఫామ్స్, కంప్లైంట్లు, ఈవిఎం, ఎలక్షన్ కాంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనే అంశాలను గుర్తించాలని, ఆల్ న్యూ అనే దగ్గర కొత్త ఓటర్ సమస్యలను నివృత్తి చేసుకోవచ్చునని మరియు ట్రాన్స్ఫర్, షిఫ్టింగ్ అనే అంశంలో ఒక కాన్స్టెన్సీ నుండి మరియొక కాన్స్టెన్సీ కి ఓటును బదిలీ చేసుకోవచ్చునని అలాగే డిలీటేషన్ ఫామ్-7 ద్వారా ఓటర్లు తమ ఓటు హక్కును అవసరం లేదనుకుంటే రద్దు చేసుకునే సదుపాయం ఉందన్నారు, ఫామ్ 8 మరియు ఫామ్ 8 ఏ ద్వారా ఓటర్ పేరు, అడ్రస్సు తప్పు ఉంటే సరి చేసుకోవచ్చు అన్నారు. కాన్స్టెన్సీ బూత్ లెవల్ లో గానీ ఏదైనా సమస్య ఉంటే కంప్లైంట్ చేసుకోవచ్చని తెలిపారు. భారతదేశంలో ఓటు హక్కును వినియోగించుకునే ప్రతి పౌరునితో పాటు ఎన్నికల విధులలో పాల్గొనే ఎన్నికల బూత్ లెవల్ స్థాయి అధికారుల వరకు అందరూ ఓటర్ హెల్ప్ లైన్ మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని వినియోగించుకోవాలని, ఎన్నికల అధికారులు ఈ ఆప్ ను ఉపయోగించడం వలన ఓటర్ నమోదు, తొలగింపు, బదిలీ చెయ్యడం తదితర అంశాలపై పూర్తి అవగాహన పొందుతారని జిల్లా కలెక్టర్ ఆ ప్రకటనలో తెలిపారు.
డిపిఆర్ఓ జయశంకర్ భూపాలపల్లి జిల్లా గారిచే జారీ చేయడమైనది.