ఓటర్లకు ఒకే దగ్గర ఓటు హక్కు ఉండేలా అవసరమైన చర్యలు మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఫొటో సిమిలర్ ఎంట్రీస్ రాజకీయ పార్టీలతో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి

పత్రిక ప్రకటన–1 తేదీ : 10–05–2022
============================================
ఓటర్లకు ఒకే దగ్గర ఓటు హక్కు ఉండేలా అవసరమైన చర్యలు
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లాలో ఫొటో సిమిలర్ ఎంట్రీస్
రాజకీయ పార్టీలతో జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి
మేడ్చల్ – మల్కాజిగిరి జిల్లా వ్యాప్తంగా ఒక ఓటరుకు ఒకచోటే ఓటు హక్కు కలిగి ఉండేలా అవసరమైన చర్యలు చేపడుతున్నామని ఈ విషయంలో అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు, ఓటర్లు సహకరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి అన్నారు.
మంగళవారం జిల్లాలోని ఆయా రాజకీయ పార్టీల నాయకులు, సంబంధిత సిబ్బందితో కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఓటర్ల సవరణ తదితర అంశాలపై జిల్లా రెవెన్యూ అధిఆకరి లింగ్యానాయక్తో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాకు అనేక ప్రాంతాల నుంచి పని నిమిత్తం వచ్చిన వారు వారి సొంత ప్రాంతాల్లోనే కాకుండా ఇక్కడ కూడా ఓటర్లుగా పేర్లు నమోదు చేసుకొన్నారని అలాంటి వారిని గుర్తించి వారికి అవసరమైన చోట మాత్రమే ఒకే చోట ఓటరుగా గుర్తింపునివ్వడం జరుగుతుందని వివరించారు. అలాగే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు కూడా ఉన్నారని వారి ఇళ్ళకు బూత్ లెవల్ ఆఫీసర్లు ((బీఎల్వో) వెళ్ళి క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపిన అనంతరం వారు ఎక్కడైతే ఓటు హక్కు కల్పించమని చెబుతారో అక్కడే ఉంచి మిగిలిన చోట్ల తొలగించడం జరుగుతుందని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి స్పష్టం చేశారు. ఓటర్లకు రెండు మూడు చోట్ల ఓటు హక్కు కలిగి ఉండటం వల్ల అనేక ఇబ్బందులు ఎదురవుతున్నాయని ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో పరిశీలించి ఓటర్ల ఇష్టానికి అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని పకడ్భందీగా నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. ఈ విషయంలో జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల నాయకులు సంబంధిత అధికారులు, సిబ్బందికి సహకరించాలన్నారు. ఈ సందర్భంగా ఆయా రాజకీయ పార్టీల నాయకులు చేసిన సూచనలు, సలహాలను సవివరింగా తెలుసుకొని వారు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలిచ్చి అనుమానాలను నివృత్తి చేశారు. అలాగే ప్రజాప్రతినిధులు సైతం తమతమ ప్రాంతాల్లో ఒకే వ్యక్తికి రెండు మూడు చోట్ల ఓటు హక్కు ఉంటే తమకు తెలియజేయాలని వాటిని తొలగించి ఒకే ఓటు ఉండేలా తమకు సహకరించాలని అదనపు కలెక్టర్ నర్సింహారెడ్డి కోరారు. ఈ సమావేశంలో ఆర్డీవో రవి, భారతీయ జనతా పార్టీ (బీజేపీ) జిల్లా అధ్యక్షులు పొన్నాల హరీశ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలంగౌడ్, ఎన్.వి ఎస్ .ఎస్ ప్రభాకర్, బహుజన సమాజ్ పార్టీ (బీఎస్పీ) నాయకులు సుదర్శన్, ఈఆర్వోలు, అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share This Post