ప్రచురణార్థం
మహబూబాబాద్, జూలై -30:
ఓటర్ల జాబితాలో చేర్పులు, మార్పులు, సవరణలు చేపట్టినందున ప్రజలకు పూర్తిస్థాయిలో విస్తృత అవగాహన పరచాలని జిల్లా అదనపు కలెక్టర్ ఎం.డేవిడ్ వివిధ పార్టీల ప్రతినిధులకు తెలిపారు.
శనివారం కలెక్టరేట్ ప్రగతి సమావేశ మందిరంలో అదనపు కలెక్టర్ ఎం. డేవిడ్ వివిధ పార్టీల ప్రతినిధులతో ఓటర్ల జాబితాలో చేపట్టిన చేర్పులు, మార్పులు,సవరణలపై సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, గతంలో జనవరి ఒకటవ తేదీ కి 18 సంవత్సరాలు నిండిన వారికి ఓటు హక్కు నమోదు చేసుకునేందుకు అవకాశం ఉండేదని, ప్రభుత్వం కొత్త నిబంధనల ప్రకారం జనవరి ఒకటవ తేదీ తోపాటు ఏప్రిల్ ఒకటవ తేదీ, జూలై 1వ తేదీ, అక్టోబర్ ఒకటో తేదీ వరకు నాలుగు దఫాలుగా 18 సంవత్సరాలు పూర్తి చేసుకున్న వారు ఓటు హక్కును నమోదు చేసుకునేందుకు అవకాశం కల్పించిందన్నారు.
ఓటర్ జాబితా నమోదు ఫారం లో చేపట్టిన మార్పులు, చేర్పులు, సవరణలు వివరిస్తూ గతంలో 6, 7, 8, 8ఏ దరఖాస్తులు ఉండేవని ప్రస్తుతం 6 ,7, 8 దరఖాస్తులు మాత్రమే ఉంటాయన్నారు. ఎనిమిదవ ఫారం మార్పు చేర్పులు, ఏడవ దరఖాస్తు ఫారం తొలగింపులు, ఆరవ దరఖాస్తు ఫారం ఓటు హక్కు నమోదు ఉంటాయన్నారు.
నాలుగు దఫాలుగా చేపడుతున్న ఓటరు జాబితా నమోదుకు ఆరు ఫారం ద్వారా ఓటు హక్కు నమోదు చేసుకోవచ్చని దరఖాస్తు ఫారం తో పాటు ఒక సంవత్సరం ఇంటి పన్ను రసీదు కానీ బ్యాంకు పాస్ పుస్తకం కానీ స్థానికత సూచించే సాక్ష్యం ఉంటే ఓటు హక్కుకు అర్హత ఉంటుందన్నారు.
ఈ సమావేశంలో టి.ఆర్.ఎస్. పార్టీ నుండి డి. రావిశ్, కాంగ్రెస్ నుండి ఎస్.దిలీప్, ఎన్.సురేష్, బి.జే.పి. నుండి పి. సందీప్, వై.ఎస్.ఆర్. సి.పి. నుండి జి.రాములు నాయక్, బి.ఎస్.పి. నుండి డి. శివరాజ్, కలెక్టరేట్ ఎలక్షన్ సెక్షన్ పర్యవేక్షకులు అనురాధ, తదితరులు పాల్గొన్నారు.