ఓటర్ల జాబితా పటిష్టంగా రూపొందించాలి…

ప్రచురణార్థం

ఓటర్ల జాబితా పటిష్టంగా రూపొందించాలి…

మహబూబాబాద్ నవంబర్ 23.

వాస్తవాలను పరిగణనలోకి తీసుకుని ఓటర్ల జాబితాను పటిష్టంగా రూపొందించాలని
తెలంగాణ గిరిజన సంక్షేమ ప్రత్యేక కార్యదర్శి జిల్లా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఈ. శ్రీధర్ ఆదేశించారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జిల్లా కలెక్టర్ శశాంక ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమంగా చేపట్టిన ఓటర్ల జాబితా రూపకల్పనపై రెవెన్యూ అధికారులతో సమీక్షించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ వివరిస్తూ జిల్లాలో నవంబర్ 1 వ తేదీ 2021 నాటికి 4,46,368 ఓటర్లు ఉన్నట్లు తెలిపారు.

జిల్లాలో రెండు నియోజకవర్గాలు ఉన్నాయని ఒకటి డోర్నకల్ – 101 నియోజకవర్గం కాగా, 102- మహబూబాబాద్ నియోజకవర్గం గా ఉందన్నారు. అక్టోబర్ 12వ తేదీ 2021 న అఖిలపక్ష పార్టీ ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ల నివేదిక అందజేయడం జరిగిందన్నారు.
జిల్లాలో ఉన్న 531 పోలింగ్ కేంద్రాలకు గాను డోర్నకల్ నియోజకవర్గంలో 256 పోలింగ్ కేంద్రాలు ఉండగా మరో 275 పోలింగ్ కేంద్రాలు మహబూబాబాద్ నియోజకవర్గంలో ఉన్నాయని వివరించారు. అదేవిధంగా జిల్లాలోని 10మండలాలలో 531 బి ఎల్ వో లు ( పోలింగ్ బూత్ స్థాయి అధికారి) లను నియమించడం జరిగిందని పర్యవేక్షణ కొరకు 52 మంది సూపర్వైజర్ లను కూడా నియమించామన్నారు. జిల్లాలో నవంబర్ 6, 7 తేదీలలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి దరఖాస్తులు స్వీకరించడం జరిగిందన్నారు. ఇప్పటివరకు ఆన్ లైన్ ద్వారా మాన్యువల్ గా వచ్చిన 1500 దరఖాస్తులను పరిశీలించడం జరుగుతుందని అన్నారు.

అనంతరం ఓటర్ల జాబితా పరిశీలకులు శ్రీధర్ మాట్లాడుతూ జనవరి 1 వ తేదీ 2022 నాటికి 18 సంవత్సరములు నిండిన వారు తప్పనిసరిగా ఓటు హక్కు పొందాలన్నారు అదేవిధంగా దివ్యాంగుల వివరాలు సేకరించి ఓటర్ల జాబితాలో ధృవీకరించాలని అన్నారు. సహాయ ఓటరు నమోదు అధికారులుగా ఉన్న తాసిల్దార్ లను ఓటర్ల జాబితా రిజిస్టర్ లను తప్పక నిర్వహించాలన్నారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ కొమరయ్య గిరిజన సంక్షేమ అధికారి దిలీప్ కుమార్ ఎలక్షన్ విభాగం పర్యవేక్షకులు రమేష్ తాసిల్దార్ లు ఎన్నికల సిబ్బంది రంజిత్ తదితరులు పాల్గొన్నారు.
————————————
జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం మహబూబాబాద్ వారిచే జారీ చేయడమైనది

Share This Post