ఓటర్ల జాబితా విడుదల:జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య

ప్రచురణానార్థం.
ములుగు జిల్లా,
తేదీ.05.01.2022

తెలంగాణా రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి, హైదరాబాద్ గారు ప్రత్యేక ఫోటో ఓటర్ల సమగ్ర సవరణ -2022 షెడ్యుల్ విడుదల చేసియున్నారు.

అట్టి షెడ్యుల్ ను అనుసరించి తేది: 03-08-2021 నుండి తేది: 20-12-2021 వరకు 01-01-2022 నాటికి 18 సం నిండిన యువతి యువకులను మరియు ఓటర్ గా అర్హుడు అయి ఓటర్ లిస్టులో పేరు నమోదు కాని వారిని గుర్తించి ఓటరుగా నమోదు చేయడం జరిగిందని, అదే విధముగా ఓటర్ లిస్టు పేర్లు, తండ్రి పేర్లు తప్పులుగా నమోదు, మరియు వలస వెళ్ళిన వారు ఒక పోలింగ్ కేంద్రము నుండి మరొక పోలింగ్ కేంద్రం మార్చు కొనుటకు ప్రత్యేక సవరణ కార్యక్రమము నిర్వహించడం జరిగినదని. అట్టి సవరణ తదుపరి 109 ములుగు (యస్.టి) నియోజక వర్గ పరిధిలో గత డ్రాఫ్ట్ ప్రకటన సమయములో మొత్తం ఓటర్లు: 2,14,974 కలరని, డబుల్ ఓటర్లు మొత్తం: 5998 గుర్తించి అట్టి ఓటర్లను తొలగించడం జరిగినదని, కొత్తగా 2,184 ఓటర్లు: నమోదు చేసుకోవడం జరిగినదని అట్టి సవరణ చేయబడిన ఫోటో ఓటర్ల జాబితాను ఈ రోజున అన్ని పోలింగ్ కేంద్రములలో ప్రకటించడం జరిగినదిని జిల్లా కలెక్టర్ ఎస్.కృష్ణ ఆదిత్య, ఒక ప్రకటన ద్వారా తెలిపారు.

Share This Post