ఓటర్ల నమోదుపై అన్ని రాజకీయ పార్టీలతో సమావేశం : ఎన్నికల పరిశీలకులు మాణిక్ రాజ్, జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష

పత్రికా ప్రకటన.     తేది::6 11 2021, వనపర్తి.

జనవరి 1, 2022 నాటికి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల పరిశీలకులు మాణిక్ రాజ్ తెలిపారు.
శనివారం వనపర్తి జిల్లా కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో అన్ని రాజకీయ పార్టీలతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం  విడుదల చేసిన “స్పెషల్ సమ్మరి రివిజన్ – 2022” లో భాగంగా నూతన ఓటరుగా నమోదు చేసుకొనుటకు, ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు మార్పులు, చేర్పులు చేసుకొనుటకు అవకాశము కల్పిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ నెల 30వ తేది లోపు అర్జిదారు తమ ధరఖాస్తులులను బూత్ లెవెల్ అధికారి, తహశీల్దారు కార్యలయములో అంత చేయవచ్చునని ఆయన సూచించారు. ఆన్ లైన్ ద్వారా ధరఖాస్తు చేసుకొనువారు  https://www.nvsp.in పోర్టల్ ద్వారా, Voter Helpline ఆప్ ద్వారా, మొబైల్ నెంబర్ ద్వారా రిజిస్టర్ చేసుకొని ధరఖాస్తు చేసుకొనవచ్చునని ఆయన వివరించారు.

1. జిల్లా వ్యాప్తంగా జనవరి 1, 2022 నాటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు  ఈ నెల 30వ తేది  లోపు నూతన ఓటరుగా నమోదు చేసుకొనుటకు ఫారం 6 ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను.

ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు, వెరొక నియోజకవర్గంనకు మార్పు చేసుకొనుటకు, మీ యొక్క పాత EPIC నెంబరు ద్వారా  ఫారం 6 ధరఖాస్తు చేసుకొనవలెను.

2. ఓటరు జాబితాలో పేర్లు ఉన్నవారు తప్పులు సరి చేసుకొనుట, సవరణ చేసుకొనుటకు ఫారం 8 ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను.

3. ఒక నియోజకవర్గంలో ఉన్న ఓటర్లు అదే  నియోజకవర్గంలోని మరొక చిరునామాకు మార్పు చేసుకొనుటకు ఫారం 8A ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను.

4.  ఓటరు జాబితా నుండి పేరు తొలగించుటకు ఫారం 7 ద్వారా ధరఖాస్తు చేసుకొనవలెను. (మరణించినవారు, డబుల్ గా నమోదైన వారు, పూర్తిగా వెళ్లిపోయిన వారు)

ఓటరు జాబితాపై ప్రజల నుండి అభ్యంతరాలు స్వీకరించేందుకు ప్రత్యేక ఓటరు నమోదు క్యాంపులను ఈ నెల తేది 6,7, 27, 28.11.2021 తేదీలలో ప్రత్యేక శిబిరాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

బూత్ లెవెల్ అధికారి  ముసాయిదా ఓటరు జాబితా కాపీలతో అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఊండి దరఖాస్తులు స్వీకరించునని, వనపర్తి జిల్లాలోని అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధులు తమ పరిధిలో ఉన్న 18 సంవత్సరాల పైబడిన వారికి ఓటు హక్కు కల్పించాలని ఆయన తెలిపారు.
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ షేక్ యాస్మిన్ భాష మాట్లాడుతూ జిల్లాలో ఏడు మండలాల పరిధిలో 290 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయని, జిల్లాలో 1.11.2021 నాటికి మొత్తం 2,45,690 మంది ఓటర్లు నమోదు అయినట్లు, వీరిలో మగవారు 1,23,629, మహిళలు 1,22,059, ఇతరులు 2 మంది ఓటర్లు నమోదు అయినట్లు జిల్లా కలెక్టర్ వివరించారు. ప్రజలందరు ఈ అవకాశమును సద్వినియోగం చేసికొనగలరని ఆమె సూచించారు. ఈ నెల 6, 7, 27, 28వ తేదీలలో స్పెషల్ క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు, ఓటర్ల నమోదు, సవరణల కార్యక్రమం విజయవంతం చేయాలని, బి.ఎల్.ఓ. లు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయడంలో కీలకపాత్ర పోషించాలని ఆమె సూచించారు.
ఈ సందర్భంగా వనపర్తి పట్టణంలోని మహిళా సమైఖ్య భవనంలో ఏర్పాటు చేసిన 125వ. నెం. పోలింగ్ స్టేషన్ ను ఎన్నికల పరిశీలకులు మాణిక్ రాజ్ తనిఖీ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ డి.వేణుగోపాల్, టిఆర్ఎస్, బిజెపి, కాంగ్రెస్, టిడిపి, సిపిఐ, సిపిఎం పార్టీల నాయకులు, తహసిల్దార్ లు తదితరులు పాల్గొన్నారు.
……….
జిల్లా పౌరసంబంధాల అధికారి, వనపర్తి ద్వారా జారీ చేయబడినది.

Share This Post