పత్రిక ప్రకటన
తేది :21.11.2022
నిర్మల్ జిల్లా సోమవారం
ఓటర్ల ప్రత్యేక నమోదు కార్యక్రమం 9 నవంబర్ నుండి 8 డిసెంబర్ 2022 వరకు నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ముష ర్రఫ్ ఫారుఖీ తెలిపారు.
మీ బూత్ లెవెల్ అధికారులు అనగా బీఎల్ఓ లు 2022 నవంబర్ 26 ,27 మరియు 2022 డిసెంబర్ 3, 4 తేదీలలో అన్ని పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉంటారు .
మీకు జనవరి 1 2023 వరకు 18 సంవత్సరాలు నిండినట్టయితే ఫామ్ నంబర్ 6 ను నింపి ఓటరుగా నమోదు చేసుకోవాలి.
మీకు 17 సంవత్సరాలు నిండినట్లయితే నమోదుకు ముందస్తు దరఖాస్తు చేసుకోండి.
ఇప్పుడు ఓటర్ నమోదుకు సంవత్సరంలో నాలుగు అర్హత తేదీలుగా సవరణ చేయబడినది
అవి
జనవరి 1
ఏప్రిల్ 1
జూలై 1
అక్టోబర్ 1
ఓటరు జాబితాలో సవరణల కొరకు ఫామ్ 8 నింపి సవరణలు చేసుకోవచ్చు. ఇందులో ఇంటి చిరునామా మార్పు దివ్యాంగుల గుర్తింపు కొరకు వివరాల సేకరణకు ఈ ఫామ్ 8 ఉపయోగపడుతుంది
ఓటరు జాబితాలో మీ పేరు పరిశీలించుకోవడానికి www.nvsp.in అనే వెబ్సైట్లో చూసుకోవచ్చును
ఈ యాప్ ద్వారా బిఎల్ఓ పై క్లిక్ చేసి ఎలక్ట్రోరల్ వివరాలలో మీ ఎపిక్ నెంబర్ ఎంటర్ చేస్తే మీ బిఎల్ఓ ను తెలుసుకోగలరు
వివరాలకు అన్ని పోలీస్ స్టేషన్లో బూతు స్థాయి అధికారి లేదా ఏ ఈ ఆర్ ఓ లేదా ఈ ఆర్ ఓ లేదా జిల్లా ఎన్నికల అధికారి కార్యాలయాన్ని సంప్రదించండి.
బూత్ స్థాయి అధికారి అందించే సేవలు
1.కొత్తగా ఓటరు జాబితాలో పేరు నమోదు చేయుట
2.ఓటరు జాబితాలో పేరు తొలగించుట
3.జాబితాలో మీ చిరునామా సవరణలు చేయుట
4.పోలింగ్ స్టేషన్ యొక్క ఓటరు జాబితా నిర్వహణ
5.ఎన్నికల ముందు ఓటర్స్
స్లిప్పుల పంపిణీ. 6.వయోవృద్ధులు దివ్యాంగులకు పోలింగ్ సమయంలో తగు సేవలు ఏర్పాటు
వివరాలకు www.nvsp.in లేదా 1950 కి కాల్ చేయండి.
జిల్లా పౌర సంబంధాల అధికారి నిర్మల్ చే జారీ చేయనైనది.