ఓటర్ల సంక్షిప్త సవరణ ఖమ్మం జిల్లాలో పకడ్బందీగా జరుగుతుందని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఈ. శ్రీధర్ తెలిపారు.

ప్రచురణార్ధం :

నవంబరు 29, ఖమ్మం:

ఓటర్ల సంక్షిప్త సవరణ ఖమ్మం జిల్లాలో పకడ్బందీగా జరుగుతుందని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఈ. శ్రీధర్ తెలిపారు. ఖమ్మం జిల్లాలో చేపట్టిన ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను సోమవారం కలెక్టరేట్ ప్రజ్ఞా సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ తో  కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల సంక్షిప్త సరవణ ప్రక్రియను జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి ఆధ్వర్యంలో చాలా పకడ్బందీగా జరుగుతుందని, ప్రధానంగా ఓటరు జాబితా సరవణలో చనిపోయిన, ఇతర ప్రాంతాలకు తరలివెళ్ళిన మార్పులు చేర్పులపై వచ్చిన క్లయిమ్స్  ను క్షుణ్ణంగా పరిశీలించి అట్టి సవరణల  చేపట్టాలని ఆయన సూచించారు. ఇప్పటివరకు అందినక్లయిమ్స్  ను డిశంబరు 15 వ తేదీలోగా పూర్తి చేయాలని సూచించారు. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన రికార్డును పకడ్బందీగా నిర్వహించాలని, నియోజకవర్గంకు సంబంధించిన రికార్డు మొత్తం ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి వద్ద (కార్యాలయంలో) భద్రపర్చాలని ఆయన సూచించారు. ఓటరు జాబితాకు సంబంధించిన రిజిస్టర్లు మరియు రశీదులు పకడ్బందీగా ఉంచాలని సూచించారు. సవరణ ప్రక్రియ పూర్తయిన పిదప తుది ఓటరు జాబితాను వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులకు అందించి రశీదు పొందాలన్నారు. ఓటర్ల సంక్షిప్త సవరణకు సంబంధించి బూత్ లెవల్ అధికారులచే పరిశీలించబడిన క్లయిమ్స్  ను తప్పనిసరిగా బూత్ లెవల్ అధికారి సంతకం ఉండాలని, అనంతరం సూపర్వైజర్లు, ఏ.ఇ.ఆర్.ఓల ద్వారా సమర్పించాలని ఎలక్టోరల్ రోల్ అబ్జర్వర్ ఈ శ్రీధర్ సూచించారు.

సమావేశంలో జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి వి.పి. గౌతమ్ మాట్లాడుతూ ఖమ్మం జిల్లాలోని ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలలో 1-11-2021 న ముసాయిదా జాబితా ప్రచురించడం జరిగిందని, నూతన ఓటర్ల నమోదు, అభ్యంతరాల స్వీకరణ, మార్పులు చేర్పులకై నవంబరు-6,7, నవంబరు 27, 28వ తేదీలలో నాలుగు రోజులు స్పెషల్ క్యాంపెన్ నిర్వహించడం జరిగిందని కలెక్టర్ తెలిపారు. ఐదు నియోజక వర్గాల లోని 136 పోలింగ్ కేంద్రాలతో పాటు అదనంగా మరో 53 నూతన పోలింగ్ కేంద్రాలను ప్రతిపాదించడం జరిగిందన్నారు. ప్రతి గ్రామ పంచాయితీకి ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా కొత్త పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. 1-11-2021 న ప్రచురించిన ముసాయిదా ఓటరు జాబితా ననుసరించి జిల్లాలో 11 లక్షల 12 వేల 245 మంది ఓటర్లుగా ఉన్నారని కలెక్టర్ వివరించారు. జిల్లాలోని ఐదు నియోజక వర్గాల పరిధిలో ఫారం-6కు సంబంధించి 3721, ఫారం-7కు సంబంధించి 10358, ఫారం-8కు సంబంధించి 782, ఫారం-8 ఏకు సంబంధించి 1659 మొత్తం 16520 క్లయిమ్స్ ఆన్లైన్ లో వచ్చినట్లు కలెక్టర్ తెలిపారు.

ఖమ్మం, వైరా, మధిర, పాలేరు, ఈ.ఆర్.ఓ.లు, ఆదర్శ్ సురభి, శ్రీమతి శిరీష, రవీంద్రనాథ్, దశరథ్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, డిప్యూటీ తహశీల్దార్లు తదితరులు సమావేశంలో పాల్గొన్నారు.

Share This Post