ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను డిశంబరు 20వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికలు అధికారి శశాంక గోయల్ తెలిపారు.

ప్రచురణార్ధం

డిశంబరు-01,ఖమ్మం:

ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియను డిశంబరు 20వ తేదీలోగా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికలు అధికారి శశాంక గోయల్ తెలిపారు. ఓటర్ల సంక్షిప్త సవరణ ప్రక్రియపై బుధవారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లాలో జరుగుచున్న ఓటరు జాబితా సవరణపై సమీక్షించి పలు సూచనలు చేసారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి మాట్లాడుతూ ఓటరు జాబితాలో నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకై అందిన క్లయిమ్స్ అన్ని ఆన్లైన్ ద్వారా గరుడయాప్లో అప్లోడ్ చేసేవిధంగా బూత్ లెవల్ అధికారుల కు శిక్షణ నివ్వాలని, ఇప్పటికే స్వీకరించిన క్లయిమ్స్ కు సంబంధించిన వివరాలను ఈ నెల 4వ తేదీలోగా గరుడ యాప్లో అప్లోడ్ చేసేవిధంగా బూత్ లెవల్ అధికారులను శిక్షణ ద్వారా సంసిద్ధం చేయాలని ఆయన సూచించారు. నవంబరు నెలలో చేపట్టిన స్పెషల్ క్యాంపెయిన్ ద్వారా అందిన క్లయిమ్లను పరిశీలించి ఈ నెల 4 వ తేదీలోగా పరిష్కరించాలని, రాష్ట్ర వ్యాప్తంగా 2.3 లక్షల క్లయిమ్స్ అందాయని, వాటిలో ఇంకనూ 1 లక్ష 68 వేల క్లయిమ్స్ వివిధ జిల్లాలో పెండింగ్లో ఉన్నాయని వాటిని ఈ నెల 20వ తేదీలోగా పరిశీలన చేసి డిస్పోస్ చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు. ఓటర్ల సంక్షిప్త సవరణపై నూతన ఓటర్ల నమోదు, మార్పులు, చేర్పులు, తొలగింపులకు సంబంధించి జిల్లా స్థాయిలో ఓటరు అవగాహన ప్రచార కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహించాలని, స్వీప్ నోడల్ అధికారులు దీనిపై సత్వర చర్యలు చేపట్టాలని ప్రచార, ప్రసారాలకు సంబంధించిన క్లిప్పింగ్లను సంబంధిత వాటాప్స్ గ్రూప్ కు ప్రతిరోజు పంపించాలన్నారు. అదేవిధంగా ఓటరు హెల్ప్ లైన్ గురించి ఓటరు అవగాహన కార్యక్రమాల ద్వారా ప్రజలను చైతన్యసపర్చాలని, ఆన్లైన్ ద్వారా ఓటరు జాబితాలో అవసరమైన మార్పులు చేసుకునే వెసులుబాటు ఉన్నందున ఓటరు నేరుగా ఓటరు హెల్ప్ లైన్ ద్వారా అట్టి సేవలు పొందవచ్చని ఆయన తెలిపారు.

స్థానిక శాసనమండలి ఎన్నికలు జరిగే జిల్లాల్లో ఎన్నికల నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉండాలని, ఎన్నికల ప్రవర్తన నియమావళీ ఉల్లంఘన జరుగకుండా మోడల్ కోడ్ ఆఫ్ కండక్టు పటిష్టంగా అమలు చేయాలని జిల్లా ఎన్నికల అధికారులకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సూచించారు. ఈ నెల 10వ తేదిన పోలింగ్ జరుగనున్నందున అవసరమైన బ్యాలెట్ పేపర్లు, బ్యాలెట్ బాక్సులు, పోలింగ్ సిబ్బంది, రవాణా సౌకర్యం, స్ట్రాంగ్రూమ్, కౌంటింగ్ హాలు తదితర ఏర్పాట్లతో సంసిద్ధంగా ఉండాని ఆయన తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద కోవిడ్ 19 నిబంధనలను ఖచ్చితంగా పాటించాలని వైద్య ఆరోగ్య శాఖ ద్వారా మాస్క్ లు , శానిటైజర్ అందుబాటులో ఉంచాలని సూచించారు. పోలింగ్ అనంతరం బ్యాలెట్ బాక్సులను నేరుగా స్ట్రాంగ్ రూముకు తరలించే విధంగా పోలీసు బందోబస్తు, రవాణా ముందస్తు ఏర్పాట్లు ఉండాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్లకు సూచించారు.

నగరపాలక సంస్థ కమీషనర్ ఆదర్శ్ సురభి, అదనపు కలెక్టర్ ఎన్. మధుసూదన్, జిల్లా రెవెన్యూ అధికారి శ్రీమతి శిరీష, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ దశరథ్, ఖమ్మం రెవెన్యూ డివిజనల్ అధికారి రవీంద్రనాథ్, ఎన్నికల విభాగపు సూపరింటెండెంట్ రాంబాబు, తదితరులు వీడియో కాన్ఫరెన్స్ లో  పాల్గొన్నారు.

Share This Post