ఓటర్ల సవరణ జాబితాలు వేగవంతంగా పూర్తి చేయాలి. 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరుగా నమోదు చేయాలి. ఓటరు హెల్ప్ లైన్ యాప్ వినియోగంపై విస్తృత ప్రచారం చేయాలి. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్. ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను అలాగే తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ కలెక్టర్లను ఆదేశించారు.

ప్రత్యేక ఓటర్ల నమోదు కార్యక్రమంలో భాగంగా కొత్తగా వచ్చిన దరఖాస్తులను అలాగే తొలగించాల్సిన పేర్లను పరిశీలించి వేగవంతంగా సవరణ జాబితాలు సిద్ధం చేయాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి  డాక్టర్ శశాంక్ గోయల్  కలెక్టర్లను ఆదేశించారు.
    బుధవారం ఓటర్ నమోదు కార్యక్రమం గరుడ యాప్ వినియోగం  పై అన్ని జిల్లాల కలెక్టర్లతో హైదరాబాద్ నుండి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 18 సంవత్సరాలు నిండిన వారందరిని ఫారం-6 ద్వారా కొత్త ఓటర్లుగా   నమోదు  చేయడాన్ని నిరంతర ప్రక్రియగా కొనసాగించాలని సూచించారు.
ప్రస్తుతం ఉన్న ఓటర్ల జాబితాలో చనిపోయిన వారి పేర్లను వారి సంబంధిత బంధువుల నుండి ఫారం-7 ద్వారా తీసుకొని లేదా సుమోటోగా తీసుకొని ఓటర్ల జాబితా నుండి వారి పేర్లను తొలగించాలని తెలిపారు. అలాగే డబుల్ ఓటర్లను గుర్తించి సత్వరమే చర్యలు చేపట్టాలని  అన్నారు. అలాగే శాశ్వతంగా వలస వెళ్ళిన వారిని గుర్తించి వారి పేర్లను ఓటర్ల జాబితా నుండి తొలగించాలని సూచించారు. ఒక పోలింగ్ స్టేషన్ పరిధిలో నివాసం ఉండి వేరే పోలింగ్ స్టేషన్ పరిధిలో ఓటరుగా నమోదై ఉంటే ఫారం -8 ద్వారా సరిచేయాలని సూచించారు. జిల్లాలో ఉన్న విద్యాలయాల్లో ప్రత్యేక క్యాంపులు ఏర్పాటు చేసి ఓటు ప్రాముఖ్యత పై కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన అధికారులకు సూచించారు. ఓటర్లకు తమ పోలీస్ స్టేషన్ సులువుగా తెలుసుకునే విధంగా భారత ఎన్నికల కమిషన్ రూపొందించిందని దీనిపై ప్రజల్లో విస్తృత ప్రచారం చేయాలని ఆయన ఆదేశించారు. గరుడ యాప్ వినియోగంపై బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. ఈవీఎం గోదాములను ప్రతిమాసం తనిఖీ చేయాలని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలు నిర్వహణకు అన్ని చర్యలు తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ టి. వినయ్ కృష్ణా రెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఓటర్ల జాబితాను త్వరితగతిన సిద్ధం చేయనున్నట్లు కలెక్టర్ తెలిపారు.  క్లెయిమ్స్ మరియు ఆబ్జెక్షన్స్ గడువు తేది  ముగిసినందున ఓటర్ల జాబితాలను త్వరితగతిన సిద్ధం చేయనున్నట్లు తెలిపారు.
ఇంకా పెండింగ్ లో  ఉన్న దరఖాస్తులను బి ఎల్ వో ల సహాయంతో పరిశీలించి జాబితాల సవరణ  కార్యక్రమాన్ని వేగవంతంగా పూర్తి చేస్తామని కలెక్టర్ ఈ సందర్బంగా తెలిపారు.
 స్థానిక సంస్థల నియోజకవర్గం ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ ఈ నెల 10వ తేదీన జరుగనున్న సందర్భంగా ఏర్పాట్లను పకడ్బందీగా  చేయనున్నట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో సూర్యాపేట, కోదాడ, హుజూర్ నగర్ లలో   పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు.   ఉదయం 8 నుండి సాయంత్రం 4 గంటల వరకు జరిగే పోలింగ్ ప్రక్రియను వెబ్ కాస్టింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.  ముఖ్యoగాఎమ్మెల్సీ పోలింగ్ ప్రక్రియలో పాల్గొనే ఓటర్లు ఎంపీటీసీలు, జడ్పీటీసీలు,  కౌన్సిలర్లు తప్పనిసరిగా రెండు డోసుల వ్యాక్సినేషన్ తీసుకుని ఉండేలా అన్ని జాగ్రత్తలు తీసుంటామని ఈ సందర్బంగా వివరించారు.
ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ యస్. మోహన్ రావు, ఏ. ఓ శ్రీదేవి, ఎలక్షన్ పర్యవేక్షకులు వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.

Share This Post