ఓటర్ జాబితాను పకడ్బందీగా రూపొందించాలి : కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ పి వెంకట్రామ రెడ్డి


ఓటరు జాబితా ను భారత ఎన్నికల సంఘం మార్గదర్శకాల కు అనుగుణంగా పకడ్భందిగా రూపొందించాలని కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ పి వెంకట్రామ రెడ్డి తహసీల్దార్, రెవెన్యూ డివిజన్ అధికారులను ఆదేశించారు.

శనివారం రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు నమోదు పెండింగ్ ఫారాలు, ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, RDO లు శ్రీ జయ చంద్రా రెడ్డి, శ్రీ విజయేంద ర్ రెడ్డి, శ్రీ అనంత రెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక తహశీల్దార్ లతో సమావేశం అయ్యారు.

ప్రతి సంవత్సరం లాగే 2022 లో రూపొందించే తుది ఓటరు జాబితా ను ఎలాంటి తప్పులకు ఆస్కారం లేకుండా పకడ్భందిగా రూపొందించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు.

ఓటర్ జాబితాలను పరిశీలించి మరణించిన వారి పేర్లను, ఇతర గ్రామాలకు వలస వెళ్లిన వారి పేర్లను, ఇతర కారణాలతో తొలగించే ముందు కుటుంబ సభ్యులకు నోటీసు ఇచ్చి పేర్లను తొలగించి జాబితాలు సిద్ధం చేయాలని ఈ ఆర్ ఒ ( తహసీల్దార్లను )లను కలెక్టర్ ఆదేశించారు.
జిల్లాలోని అన్ని మండలాల్లో, మున్సిపల్ పరిధిలో ఓటర్ జాబితాలను క్రమబద్ధీకరించాలని కలెక్టర్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు
ఓటర్ జాబితాలను నవీకరించి పరిపూర్ణమైన ఓటర్ జాబితా సిద్ధం చేయాలని అధికారులకు సూచించారు.

అంతకు ముందు తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ అన్ని జిల్లాల కలెక్టర్లతో ప్రత్యేక ఓటరు నమోదు, పెండింగ్ ఫారాలు, ఎపిక్ కార్డులు, స్వీప్ కార్యక్రమాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

జిల్లా కలెక్టర్,జిల్లా రెవెన్యూ అధికారి శ్రీ బి చెన్నయ్య, RDO లు శ్రీ జయ చంద్రా రెడ్డి, శ్రీ విజయేంద ర్ రెడ్డి, శ్రీ అనంత రెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, గజ్వేల్, దుబ్బాక తహశీల్దార్ లు ఈ వీడియో కాన్ఫరెన్స్ కు IDOC మీటింగ్ హల్ నుండి హాజరయ్యారు.

తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి డాక్టర్ శశాంక్ గోయల్ మాట్లాడుతూ….
ఓటర్ జాబితా లో ఎలాంటి తప్పిదాలు లేకుండా సిద్ధం చేయాలని కలెక్టర్ లను ఆదేశించారు. అదేవిధంగా కొత్తగా ఓటరుగా నమోదు అయ్యేందుకు సమర్పించిన ఫారాలు మార్పులు,చేర్పులు సంబంధించిన పత్రాలను పరిశీలించి చర్యలు చేపట్టాలని ఆయన సూచించారు. ఇందులో భాగంగా ఓటర్ల జాబితాలో ఉన్న లాజికల్ పొరపాట్లు, డెమో గ్రాఫికల్ పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు.

ఓటరు జాబితా తయారీ కార్యక్రమానికి ముందస్తుగా ఆగస్టు 9,2021 నుంచి అక్టోబర్ 31,2021 వరకు ప్రి రివిజన్ కార్యక్రమాలు నిర్వహించాలని ఆయన తెలిపారు. నవంబర్ 1, 2021 న ముసాయదా ఒటరు జాబితా విడుదల అవుతుందని, నవంబర్ 30,2021 వరకు సదరు జాబితా పై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వికరించాలని, రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని, *డిసెంబర్ 20,2021లోగా అభ్యంతరాలను ,ఓటర్ క్లెయిమ్స్ ను పూర్తి స్థాయిలో పరిష్కరించి, జనవరి 5,2022 న తుది ఓటరు జాబితా రు
రూపోందించాలని తెలిపారు.

ఓటర్ల నమోదు నిరంతర ప్రక్రియ అని, ఓటర్ల నమోదుకు జనవరి 1, 2022 ప్రామాణికంగా తీసుకుని అప్పటికి 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికి ఓటరు జాబితాలో చోటు కల్పించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు.

కలెక్టర్ , జిల్లా ఎన్నికల అధికారి శ్రీ పి వెంకట్రామ రెడ్డి జిల్లాలో ఓటరు జాబితా నవీకరణ కు తీసుకుంటున్న చర్యలను తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి డా. శశాంక్ గోయల్ కు వివరించారు.

జిల్లాలో పరిపూర్ణమైన ఓటర్ జాబితా సిద్ధం చేయడానికి చర్యలు చేపడుతున్నామని తెలిపారు. జిల్లాలో ఓటర్ల నమోదు మార్పులు, చేర్పులు, సవరణలకు సంబంధించిన ఫారాలను పరిశీలించి చర్యలు తీసుకుంటామని తెలిపారు.

Share This Post