ఓటర్ జాబితా లోని లాజికల్ ఎర్రర్స్, ఫామ్ 6, 6ఏ,7, 8, 8ఏ పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 30 లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

ఓటర్ జాబితా లోని లాజికల్ ఎర్రర్స్, ఫామ్ 6, 6ఏ,7, 8, 8ఏ పెండింగ్ దరఖాస్తులను ఈ నెల 30 లోగా పరిష్కరించాలని రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి శశాంక్ గోయల్ జిల్లా కలెక్టర్లకు సూచించారు.

శనివారం హైదరాబాదు నుండి ఆయన జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ రోల్ మేనేజ్మెంట్, డ్రాఫ్ట్ పబ్లికేషన్, రేషనలైజేషన్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్, స్వీప్ యాక్టివిటీస్ తదితర అంశాలపై దిశానిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాన్ ఫోటో ఓటర్ల జాబితాను సవరించాలన్నారు. డ్రాఫ్ట్ పబ్లికేషన్ కు ముందే చనిపోయిన, డూప్లికేట్ ఓటర్స్ కు సంబంధించి నోటీసులు ఇచ్చి తొలగించాలని సూచించారు.

పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ చేయాలని, ఒక పోలింగ్ కేంద్రంలో పదిహేను వందలకు పైగా ఓటర్లు ఉన్నట్లయితే, అదనంగా కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించాలన్నారు.
స్వీప్ యాక్టివిటీస్ లో భాగంగా గ్రామ స్థాయి వరకు ఓటరు నమోదుపై ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు.
జిల్లా కలెక్టర్ హనుమంతరావు మాట్లాడుతూ జిల్లాలో ఆయా విషయాలపై ప్రత్యేక దృష్టి సారించి త్వరితగతిన పూర్తి చేయడానికి చర్యలు తీసుకుంటున్నట్లు సి ఈ ఓ కు తెలిపారు.

వీడియో కాన్ఫరెన్స్ అనంతరం జిల్లా కలెక్టర్ హనుమంతరావు రెవెన్యూ డివిజనల్ అధికారులు, సంబంధిత సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఓటర్ జాబితాలను ఇప్పటి నుండే సరిచేసుకోవాలన్నారు. చనిపోయిన ఓటర్లను, డూప్లికేట్ ఓటర్లను నిబంధనల మేరకు తొలగించాలని సూచించారూ.claims మరియు అభ్యంతరాలను నిర్ణీత సమయంలోగా పరిష్కరించాలని స్పష్టం చేశారు.
పదిహేను వందల మంది ఓటర్లకు ఒక పోలింగ్ కేంద్రం ఉండేలా చూసుకోవాలని, ప్రత్యేకించి పోలింగ్ కేంద్రాలను, లోకేషన్ మార్పులు తదితరాలను పరిశీలించాలని తెలిపారు. 1500 ఓటర్లు దాటితే కొత్త పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని తెలిపారు. ఆయా విషయాలపై సంబంధిత అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని ఆయన కోరారు.

ఈ కార్యక్రమంలో రెవిన్యూ డివిజనల్ అధికారులు నగేష్, రమేష్ బాబు, ఎలక్షన్ సెల్ సూపర్డెంట్ వెంకటేష్, పాషా, ఎలక్షన్ డిప్యూటీ తహసీల్దార్లు, డాటా ఎంట్రీ ఆపరేటర్ లు, తదితరులు పాల్గొన్నారు.

Share This Post