ఓటర్ నమోదుకు విస్తృత కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం- జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

ప్రత్యేక ఓటర్ నమోదు కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా విజయవంతం చేయాలనీ ప్రధాన ఎన్నికల అధికారి డా.శశాంక్ గోయల్ అన్నారు. బుధవారం రోజున హైదరాబాద్ నుండి జిల్లాల కలెక్టర్లు, అదనపు కలెక్టర్లతో ప్రత్యేక ఓటర్ నమోదు స్వీప్ కార్యక్రమాలు, తదితర అంశాలపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్బంగా సీఈఓ మాట్లాడుతూ, గ్రామాలలో ఓటర్ నమోదు కార్యక్రమం పై విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో ఓటర్ జాబితా డ్రాఫ్ట్ రోల్ పై చర్చించాలని, గరుడ యాప్ గురించి వివరించాలని తెలిపారు. స్వీప్ కార్యక్రమాలను వేగవంతం చేసి ప్రజల్లో అవగాహన కల్పించి 18 ఏళ్ళు నిండిన ప్రతి ఒక్కరు తమ పేరును ఓటర్ ను నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ మాట్లాడుతూ, జిల్లాలోని అన్ని గ్రామాలలో స్వీప్ కార్యక్రమాలను స్థానిక విద్యాశాఖ, రెవెన్యు, పంచాయితీ శాఖల సహకారంతో నిర్వహిస్తున్నామని తెలిపారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేసి ఓటర్ నమోదు, గరుడ యాప్ వినియోగం వంటి అంశాలపై వివరించడం జరిగిందని తెలిపారు. బూత్ స్థాయి అధికారులకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించామని, ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు ఎలక్టరోల్ లిటరసీ క్లబ్ ల ఏర్పాటు, చునావ్ పాఠశాలల ఏర్పాటుపై అవగాహన కల్పించడం జరిగిందని తెలిపారు. జిల్లాలో అర్హత కలిగిన వారందరిని ఓటర్ గా నమోదు చేసేందుకు విస్తృత కార్యక్రమాలు చేపడుతున్నామని పేర్కొన్నారు. జిల్లాలోని ఆదిలాబాద్, బోథ్ నియోజక వర్గాలలో ఓటర్ నమోదుకు 1819 దరఖాస్తులు రావడం జరిగిందని, వివిధ కారణాల వలన 509 దరఖాస్తులను రిజక్ట్ చేయడం జరిగిందని, 1050 దరఖాస్తులను అప్ డేట్ చేయడం జరిగిందని తెలిపారు. ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, స్వీప్ కోర్ కమిటీ సభ్యులు ఎన్.భీమ్ కుమార్, స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, ఆదిలాబాద్ పట్టణ తహసీల్దార్ భోజన్న, ఎన్నికల విభాగం నాయబ్ తహసీల్దార్లు సాయి మహేష్, శ్రీవాణి, సాంకేతిక సహాయకులు ఉమాకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Share This Post