ఓటర్ నమోదు కార్యక్రమం లో పొరపాట్లు జరుగకుండా చూడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

పత్రికాప్రకటన తేదిః 07-10-2021
ఓటర్ నమోదు కార్యక్రమం లో పొరపాట్లు జరుగకుండా చూడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి
జగిత్యాల, అక్టోబర్ 07: ఓటరు నమోదులో పొరపాట్లు లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్ జి. రవి అన్నారు. గురువారం జిల్లా కలెక్టర్ కార్యాలయం నుండి ఆర్డిఓల, తహసీల్దార్లు, కలెక్టర్ కార్యాలయ పర్యవేక్షకులతో జూమ్ వెబ్ ద్వారా వివిధ రెవెన్యూ అంశాలపై సమీక్షించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, ఎన్నికల విధానం కొరకు ఎర్పాటు చేయబడిన గరుడ యాప్ పై అధికారులు బాగా పనిచేస్తున్నారని అన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రం వారిగా పరిశీలించి డూప్లికేట్, చనిపోయిన వారి వివారాలను ఓటర్ నివేధికల నుండి తొలగించాలని , అర్హత ఉన్న వారి పేర్లు వివరాలు పకడ్బందీగా నిర్వహించాలని,వివిధ రాజకీయ పార్టీలతో సమావేశాలు నిర్వహించాలని సూచించారు.
కళ్యాణలక్ష్మి, షాధిముబారక్ కొరకు ధరఖాస్తులపై చర్యలు తీసుకోవడంలో అలస్యం జరగకుండా చర్యలు తీసుకోవాలని, రిజిస్ట్రేషన్ కొరకు దరణి ద్వారా నమోదు చేసుకొని వివిధ కారణాల ద్వారా నిలిచిపోయిన వాటిని పరిశీలించాలని, ధ్రువీకరణ పత్రాలు సక్రమంగా సమర్పించని యెడల వాటిని తిరస్కరించాలని అన్నారు. ప్రజావాణి కార్యక్రమం ద్వారా వచ్చే ధరఖాస్తులపై చర్యలు తీసుకోవాలని, పెండింగ్ మ్యూటేషన్లు, సక్షేషన్ ఆఫ్ అప్లికేషన్లు, ల్యాండ్ మ్యాటర్ గ్రీవెన్స్, ఈ ఆఫీస్ ద్వారా వచ్చే ఫైళ్లపై చర్యలు తీసుకోవడంలో అలస్యం జరగకుండా చూడాలని, కార్యాలయ సిబ్బంది అందరికి ఈ ఆఫీస్ లాగీన్ లను కేటాయించి, కార్యాలయ ఫైళ్ల నిర్వహణ పూర్తిగా ఈఆఫీస్ ద్వారా జరగేలా చూడాలని, ఈ ఆఫీస్ పై సిబ్బందికి అవసరం మేరకు అవగాహన కల్పించాలని తెలియ చేశారు.
ఇసుక రవాణలో అక్రమాలు జరగకుండా చర్యలు తీసుకోవాలని, అర్డీఓలు ప్రత్యేక దృష్టి సారించి అక్రమ రవాణ జరగకుండా, పోలీసు, మైనింగ్ మరియు రెవెన్యూ అధికారులు బృందంగా క్షేత్రస్థాయిలో తనఖీలు నిర్వహించి కఠిన చర్యలు తీసుకోవాలని, అక్రమ నిర్మాణాలు జరుగకుండా అధికారులు పర్యవేక్షించాలని, అనుమతులు మీరి నిర్మాణాలు జరిగినట్లు గుర్తించినట్లయితె వాటిపై చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలని అన్నారు. నిర్మాణారంగంలో పనిచేసే వారితో, అవగాహ కార్యక్రమాలను నిర్వహించాలని, భూసంబంధిత విషయాలపై ఉన్న పెండింగ్ సమస్యలు, సర్వే, భూ ఆక్రమణ లపై ఎవైన సమస్యలు ఉండే నివేధిక తెప్పించి వాటిపై చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఓటర్ నమోదు కార్యక్రమం లో పొరపాట్లు జరుగకుండా చూడాలి :: జిల్లా కలెక్టర్ జి. రవి

జిల్లా పౌరసంబంధాల ఆధికారి కార్యాలయం, జగిత్యాల చే జారిచెయనైనది.

Share This Post