ఓటర్ నమోదు పై విస్తృత ప్రచారం నిర్వహించాలి- స్వీప్ కొర్ కమిటీకి సూచించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

18 ఏళ్ళ వయసు గల వారందరి పేర్లను ఓటర్ గా నమోదు చేసుకునేవిధంగా జిల్లాలో విస్తృత ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. మంగళవారం రోజున కలెక్టరేట్ సమావేశ మందిరంలో స్వీప్ కొర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, కళాశాలలు, విద్య సంస్థలలో చదువుతున్న 18 ఏళ్ళు నిండిన వారందరి పేర్లను ఓటర్ జాబితాలో నమోదు అయ్యే విధంగా ఆయా విద్య సంస్థల యాజమాన్యాల సహకారంతో నిర్వహించాలని అన్నారు. ఈ నెల 30 తేదీ లోగా నమోదు కార్యక్రమం పూర్తి కానున్నందున అర్హత గల వారి పేరును నమోదు చేయాలనీ అన్నారు. సోషల్ మీడియా, అల్ ఇండియా రేడియో, దూర దర్శన్, సిటీ కేబుల్, వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ఓటర్ నమోదుపై అవగాహన కల్పించాలని అన్నారు. స్వచ్చంధ సంస్థల సహకారం, NSS, NCC, NYK ల సహకారం తో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలని అన్నారు. స్వీప్ నోడల్ అధికారి లక్ష్మణ్ మాట్లాడుతూ, 18 సంవత్సరాల వయసు గల వారందరి పేర్లను ఓటర్ గా నమోదు చేయడం, ఓటర్ జాబితాలో తప్పులు లేకుండా చూడడం, 14 నుండి 17 సంవత్సరాల వయసు గల భవిష్యత్ ఓటర్లకు అవగాహన కల్పించడం, ప్రతి ఓటర్ తమ ఓటు హక్కు వినియోగించుకునే విధంగా చూడడం స్వీప్ కొర్ కమిటీ బాధ్యత అని అన్నారు. స్వీప్ కోర్ కమిటీ సభ్యులు, జిల్లా పౌర సంబంధాల అధికారి ఎన్.భీమ్ కుమార్ మాట్లాడుతూ, తెలుగు, హిందీ, మరాఠి, గోండి, లంబాడా బాషలలో ఓటర్ నమోదు పై వాయిస్ మెస్సేజ్ లు, స్థానిక సిటీ కేబుల్ ల ద్వారా స్క్రోలింగ్, అడ్వేర్టైజ్ మెంట్ లు, ప్రచారం చేపట్టాలని సూచించారు. ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న సిబ్బంది కుటుంబీకుల పేర్లను నమోదు చేసుకునే విధంగా ప్రోత్సహించాలని అన్నారు. తెలంగాణ సాంస్కృతిక సారథి కళాకారుల ద్వారా గ్రామగ్రామాన ప్రచారం నిర్వహించాలని అన్నారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో ప్రతి రోజు చెత్త సేకరణకు వినియోగించే వాహనాల ద్వారా మైక్ ద్వారా ప్రచారం నిర్వహించాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ ఎన్.నటరాజ్, ఆర్డీఓ రాజేశ్వర్, నెహ్రు యువ కేంద్రం కో- ఆర్డినేటర్ సుశీల్ భడ్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, అల్ ఇండియా రేడియో ప్రతినిధి రామేశ్వర్, EDM రవి, NSS కో-ఆర్డినేటర్ సత్యనారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Share This Post