ఓటర్ హెల్ప్ లైన్ మోబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొండి

18 సంవత్సరాలు నిండిన యువతీయువకులందరు తమ యొక్క వివరాలను ఓటర్ మోబైల్ హెల్ప్ లైన్ యాప్ నందు నమోదు చేసి ఓటర్ గా నమోదు చేసుకోవాలని స్వీప్ నోడల్ అధికారి B. లక్ష్మణ్ అన్నారు. బుధవారం స్థానిక వాగ్దేవి ఆర్ట్స్ & సైన్స్ డిగ్రీ కళాశాలలో ఓటర్ అవగాహన సదస్సుకు ఆయన హజరై విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఇప్పటికే ఓటర్ గా నమోదైనవారు ఓటర్ మోబైల్ హెల్ప్ లైన్ యాప్ లో ఫారం నంబర్- 6B ద్వారా తమ యొక్క ఏపిక్ కార్డు కు ఆధార్ ను స్వచ్ఛందంగా అనుసంధానం చేసుకోవాలన్నారు. ఆదిలాబాద్ జిల్లాలో ఇప్పటి వరకు 4,13,777 మంది ఓటర్లు ఉన్నారని, అందులో ఈ రోజు వరకు 60% మంది తమ ఆధార్ ను అనుసంధానం చేసుకున్నారని తెలిపారు. ఈ కార్యక్రమములో ప్రతీ పోలింగ్ స్టేషన్ కు సంబంధించిన BLO లు, గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని స్వయం సహాయక సంఘాల సభ్యులు, జూనియర్, డిగ్రీ కళాశాల విద్యార్థులు, అంబసీడర్లు, లెక్చరర్లు పాల్గొంటున్నారని తెలిపారు. ఓటర్ గా నమోదైన వారు ఫారం -6B ను ఓటర్గా నమోదు కాని 18 సంవత్సరాల వయస్సువారు ఫారం-6 ను నింపి మన జిల్లాను రాష్ట్ర స్థాయిలో ఓటర్ నమోదు ప్రక్రియలో ఆగ్రగామిగా ఉంచేందుకు కృషి చెయ్యాలని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపాల్ E. విఘ్నేశ్వర్ రెడ్డి, NSS అధికారులు, యాదవ్, దినేష్, లెక్చరర్లు, విద్యార్థులు పాల్గోన్నారు.

Share This Post