ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గోడప్రతిని ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్.

18 సంవత్సరాలు నిండిన వారు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ద్వారా తమ పేరును నమోదు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ సిక్తా పట్నాయక్ అన్నారు. సోమవారం సాయంత్రం తన క్యాంపు కార్యాలయంలో భారత ఎన్నికల కమిషన్ రూపొందించిన ఓటర్ హెల్ప్ లైన్ యాప్ గోడప్రతిని కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ, జనవరి 1, 2022 నాటికీ 18 సంవత్సరాలు నిండి ఓటర్ నమోదు చేసుకోని వారు తమ పేరును ఓటర్ జాబితాలో ఈ యాప్ ద్వారా చేసుకోవచ్చని తెలిపారు. ప్రతి ఒక్కరు ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవాలని తెలిపారు. ఈ యాప్ లో ఓటర్ కు సంబందించిన వివరాలు, సేవలు, సదుపాయాల గురించి తెలుసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా ఎన్నికల కమిషన్ కు సంబందించిన వివరాలను కూడా తెలుసుకోవచ్చని అన్నారు. ఇప్పటికే ఓటర్ గా నమోదు చేసుకున్న వారు వారి పేరు, తండ్రి పేరు, చిరునామా, ఫోటో, వయస్సు, తదితర వివరాలను మార్పులు చేసుకోదలిస్తే తగు ధ్రువీకరణ పత్రాలతో సరి చేసుకోవచ్చని అన్నారు. ఓటర్ గా నమోదు అయిన వారు తన ఓటు ఏ పోలింగ్ కేంద్రంలో ఉందొ ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చని అన్నారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో జిల్లా పౌర సంబంధాల అధికారి, స్వీప్ మెంబర్ ఎన్.భీమ్ కుమార్, ఎన్నికల విభాగం పర్యవేక్షకురాలు నలంద ప్రియా, మాస్టర్ శిక్షకులు లక్ష్మణ్, సాంకేతిక నిపుణులు ఉమాకాంత్ పాల్గొన్నారు.

Share This Post