ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి కలెక్టర్ – హరీష్

ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి కలెక్టర్ – హరీష్

ఓటరు సేవలకై ప్రతి ఒక్కరు తమ మొబైల్ లో ఓటర్ హెల్ప్ లైన్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకోవలసిందిగా జిల్లా కలెక్టర్ ఎస్. హరీష్ సూచించారు. ఓటర్ హెల్ప్ లైన్ యాప్ కు సంబంధించి భారత ఎన్నికల కమీషన్ రూపొందించిన గోడ పత్రికను స్వీప్ నోడల్ అధికారి రాజి రెడ్డి తో కలిసి శుక్రవారం తన ఛాంబర్ లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ యాప్ ఎంతో ఉపయుక్తమని, ఓటర్లకు సంబంధించిన మొత్తం వివరాలతో పాటు ఓటరు సేవలు, సదుపాయాల గురించి అన్ని వివరాలు తెలుసుకోవడమే గాక ఎన్నికల కమీషన్ కు సంబంధించిన తాజా సమాచారాలన్నీ ఎప్పటికప్పుడు తెలుసుకోవచ్చని అన్నారు. ఈ యాప్ ద్వారా ఓటరు నమోదుతో పాటు, ఇదివరకే ఓటరుగా నమోదై ఉంటె ఏ పోలింగ్ బూత్ లో ఓటు హక్కు ఉందొ తెలుసుకోవచ్చని అన్నారు. అదేవిధంగా అసెంబ్లీ నియోజక వర్గం మారినా, చిరునామా మారినా, లేక ఏదైనా సవరణలు చేసుకోవడానికి అవకాశముంటుందని అన్నారు. కాబట్టి ఓటు హక్కు కలిగిన ప్రతి ఒక్కరు ఫ్రెండ్లి మొబైల్ యాప్ ను డౌన్ లోడ్ చేసుకొని ఓటరుకు ఉన్న సదుపాయాలు, సేవలు తెలుసుకొని ఎన్నికల వేళ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఆసుపత్రి సూపరింటెండెంట్ చంద్రశేఖర్, కలెక్టరేట్ కు చెందిన ఎన్నికల పర్యవేక్షకులు శైలేందర్, మమత తదితరులు పాల్గొన్నారు.

Share This Post