ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధం

ఓటు ప్రజాస్వామ్య పరిరక్షణకు వజ్రాయుధం

 

ఓటు హక్కుతో బలోపేతమైన మంచిసమాజాన్ని రూపోందించగలం

 

జిల్లా జడ్జి ప్రతిమ

0 0 0 00

        ఓటు ఎంతో శక్తివంతమైనదని, ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయుధం లాంటిదని, నైతిక బాధ్యతగా ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించు కోవాలని జిల్లా జడ్జి బి ప్రతిమ అన్నారు.

 

 

     బుదవారం కలెక్టరేట్ ఆడిటోరియలో నిర్వహించిన 13వ జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా జడ్జి పాల్గోన్నారు.  ఈ సందర్బంగా జిల్లా జడ్జి మాట్లాడుతూ ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు వజ్రాయుదంతో సమానమైందని, అంతటి ప్రాదన్యత గల ఓటును నిష్పక్షపాతంగా ఎటువంటి ప్రలోబాలకు గురికాకుండా వినియోగించుకున్నప్పుడే బంగారు వ్యవస్థను రూపొందించుకోగలమన అన్నారు . 18 సంవత్సరాలు నిండిన ప్రతిఒక్కరు నూతన ఓటర్లుగా నమోదు చేసుకొని విలువైన, శక్తివంతమైన ఓటుహక్కును పొందాలన్నారు.  ఓటుప్రాదాన్యతను వివరిస్తూ ఆంధ్రప్రదేశ్ కు చెందిన తాను వృత్తిరిత్యా హైదరాబాద్ లో కుటుంబంతో స్థిరపడ్డామని, నా ఓటు హక్కు ప్రస్తుతం ఆంద్రప్రదేశ్ లొ ఉందని, దానిని తెలంగాణ రాష్ట్రానికి తెచ్చుకోవడానికి కృషిచేస్తున్నానని వివరించారు.

 

     అనంతరం 18 సంవత్సరాలు పూర్తిచేసుకోని నూతనంగా ఓటర్లుగా నమోదైన  కొత్తపెల్లి మండలానికి చెందిన  నవీన్, వంశీ లకు ఎపిక్ కార్డులను అందజేశారు.  అనంతరం ఎలక్షన్ విధులలో విశేష సేవలందించిన అధికారులు, సిబ్బందికి ప్రసంశాపత్రాలను ప్రదానం చేసి, సీనియర్ సిటిజన్ లను శాలువాతో సత్కరించారు. అనంతరం ఓటు ప్రతిజ్ఞను చేశారు.

 

     జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ మాట్లాడుతూ, ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు ప్రదానమైన  అస్త్రం అని అన్నారు.  ఓటరు నమోదులో బిఎల్ఓ, అంగన్ వాడి, విఆర్ఎ, పంచాయితీ కార్యదర్శులు, మున్సిపల్ ఆర్.ఓలు బాగా పనిచేశారని అభినందించారు.  రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులుగా ప్రభుత్వం ప్రవేశపెట్టే పథకాల అమలుకు కృషిచేస్తున్నప్పటికి, రాజ్యాంగ బద్దంగా పూర్తిగాచట్టానికి లోబడి పనిచేసేది మాత్రం ఒక్క ఎన్నికలలో మాత్రమేనని అన్నారు. రానున్న అసెంబ్లి ఎన్నికల దృశ్యా నామినేషన్ మొదలు తుదిఫలితాలను వెల్లడి వరకు ప్రతి ఓక్కరు చట్టానికి లోబడి పనిచేయాలని సూచించారు.  గతంలో ప్రతి రికార్డు మ్యానువల్ ఉండేదని, కాని ప్రస్తుతం టెక్నాలజి అభివృద్ది చెందినందున గరుడ  మోబైల్ యాప్ ను ప్రవేశపెట్టడం జరిగిందని,   ఒక్కయాప్ తోనే ఫామ్-6 ద్వారా నూతన ఓటరుగా నమోదు చేసుకోగలమని, అదేవిధంగా ఫామ్-7 ద్వారా రెండుచోట్ల ఓటరుగా నమోదవ్వడం, రెండు పోలింగ్ కేంద్రాలలో లేదా వేరువెరు నియోజక వర్గాలలో తమ పేరు నమోదై ఉండడాన్ని సరిచేసుకోవచ్చని తెలిపారు.  తుది ఓటరు జాబితాను తయారు చేసే క్రమంలో ఫామ్-7 ద్వారా స్థానికంగా లేకపోయిన, డబల్ ఎంట్రిలుగా గుర్తించిన వాటిలో స్వయంగా ఓటరును సంప్రదించిన తరువాతే చర్యలు తీసుకోవాలని, చనిపోయిన వారు దృవీకరణ పత్రాన్ని ఇచ్చినప్పటికి వారి బందువుల ద్వారా మరోసారి స్పష్టత తీసుకున్న తరువాతే వారి వివరాలను జాబితా నుండి తొలగించాలని పేర్కోన్నారు.  జిల్లాలో 85శాతం ఓటరు కార్డుతో ఆదార్ లింకేజిని పూర్తిచేసుకోవడం జరిగిందని, అర్బన్ లో అర్.పి ల సహాకారంతో ఆధార్ లింకేజి పనులు పూర్తిచేయాలని తెలిపారు.  ఈవియం మిషన్లు హ్యక్ చేయడానికి వీలులేని ఓ క్యాలిక్యులేటర్ వంటి బ్యాటరి ఆదారిత ఎలక్ట్రానిక్ పరికరమని అన్నారు. దీనికి ఇంటర్ నెట్, వైఫై వంటి సౌకర్యాలు ఉండవని తెలిపారు.  ప్రజలు వారు ఈవియం ద్వారా ఓటు వేసిన వెంటనే మరింత స్పష్టతను కలిగించేలా వివి ప్యాట్ ద్వారా ఎవరికి ఓటువేయడం జరిగిందో తెలుసుకునేలా ప్రింట్ కూడా వస్తుందని దాని ద్వారా వారి అనుమానాలను పూర్తిస్థాయిలో నివృత్తి చేసుకోవచ్చని తెలిపారు.   ఓటుహక్కును స్వేచ్చయుతంగా ఓటరు వాడుకునే అవకాశాన్ని కల్పించినప్పడు, దానిని తాత్కాలిక ప్రలోభాలకు గురికాకుండా విలువలు,ప్రాదాన్యతతో ఓటు హక్కును వినియోగించుకోవాలని పేర్కోన్నారు.

 

     పోలీస్ కమీషనర్ వి. సత్యనారాయణ మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో ఓటుకు ఎంతో విలువందని అన్నారు. ఈవియంలు పనితీరుపై సోషల్ మీడియాలో వచ్చే అసత్యప్రచారాలను నమ్మవద్దని, ఎన్నికల సమయంలో ఈవియంల ట్యాంపరింగ్ జరిగే అవకాశం ఏమాత్రం ఉండదని తెలిపారు.   ఓటుప్రాదాన్యతను వివరిస్తు ఓటరుగా నమోదు చేసుకునేలా ఇంటింటికి తిరుగుతూ వచ్చే సిబ్బందికి విలువనిచ్చి వారికి సహకరించాలని తెలిపారు.   ఓటు విలువను అందరు తెలుసుకోవాలని తెలిపారు.

 

    స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ మాట్లాడుతూ జిల్లాలోని కరీంనగర్, చోప్పదండి, మానకొండూర్ మరియు హుజురాబాద్ నియోజకవర్గాలలో 1338 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేయడం జరిగిందని,  జనవరి 5 వరకు స్పెషల్  సమ్మరి రివిజన్ ఆఫ్ ఫోటో ఎలక్ట్రోరోల్ ను నిర్వహించి తుది ఎలక్టోరోల్ ను ప్రచురించడం జరిగిందని పేర్కోన్నారు. 4,93,728 పురుషులు, 5,02,265 మహిళాలు , 31 ట్రాన్స్ జండర్స్, 116 ఎన్ఆర్ఐ మరియు 583 సర్వీస్ ఓటర్లను 4 నియోజకవర్గాలలో ఉన్నారని తెలిపారు.  ఓటు విలువను తెలియజేస్తు  స్వయంగా  వ్రాసిన కవితను ఈ సందర్బంగా చదివి వినిపించారు.

 

  ఓటర్ నమోదులో ఉత్తమ సేవలందించిన అధికారులకు, సీనియర్ సిటిజన్స్ కు శాలువతో కలెక్టర్ సన్మానించారు. 18 సంవత్సరాల నుండి నూతనంగా ఓటు హక్కు పొందిన యువకులకు ఎపిక్ కార్డులను అందజేశారు.

 

 

     ఈ కార్యక్రమంలో జిల్లా లీగల్ సర్వీసెస్ అథారటి సెక్రటరి సుజయ్, అదనపు కలెక్టర్ జి.వి. శ్యాంప్రసాద్ లాల్, ట్రైని కలెక్టర్ లెనిన్ వాత్సల్ టోప్పొ, జడ్పి సిఈఓ ప్రియాంక, కరీంనగర్, హుజురాబాద్ ఆర్డిఓలు ఆనంద్ కుమార్,  హరిసింగ్,  డిఆర్ డి ఓ శ్రీలతా, డ్వామా పిడి రవీందర్, జిల్లా సంక్షేమ అధికారి సబితా, ఇతర జిల్లా అధికారులు,తహసీల్దార్ లు సిబ్బంది పాల్గోన్నారు.

Share This Post