ఓటు ప్రాధాన్యత గురించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి ఓటరు గా పేరు నమోదు చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు

వరంగల్

ఓటు ప్రాధాన్యత గురించి ప్రతీ ఒక్కరికి అవగాహన కల్పించి ఓటరు గా పేరు నమోదు చేసేలా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్ గోపి అన్నారు

బుధవారం జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా కలెక్టరేట్ లోని కాన్ఫెరెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన కార్యక్రమం లో జిల్లా కలెక్టర్ పాల్గొని ముందుగా అందరితో ఓటరు ప్రతిజ్ఞ చేపించి అనంతరం ఓటు హక్కు ప్రాధాన్యత ను తెలిపారు

బ్రిటిష్ వారి కాలంలో అందరికి ఓటు హక్కు లేదని … చదువుకున్న వారికి, టాక్స్ కట్టే వాళ్ళకి, ఉన్నత స్థానాల్లో ఉన్న వారికి మాత్రమే ఓటు హక్కు ఉందన్నారు….
రాజ్యాంగం ఏర్పడ్డాక అందరికి ఓటు హక్కు కల్పించడం వల్ల నేడు మనం ఓటరుగా నమోదు అయ్యామని తెలిపారు
లేకపోతే ఓటు హక్కు కావాలని పోరాడే దుస్థితి ఉండేదన్నారు.

ఇంతటి వజ్రయుధం లాంటి ఓటు హక్కు ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు

18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరూ ఓటరు గా నమోదు పొందడం కనీస కర్తవ్యం అని భావించాలన్నారు

ఎలాంటి ప్రలోబాలకు లొంగకుండా, తారతమ్యాలు లేకుండా నిజాయితీ తో ఓటు వేసినప్పుడే ఓటు హక్కు కు సార్ధకం లభిస్తుందన్నారు

జాతీయ ఓటరు దినోత్సవం సందర్బంగా ఏర్పాటు చేసిన వివిధ పోటీల్లో గెలిచిన విద్యార్థులకు, ఓటరు కార్డ్ ను ఆధార్ కార్డ్ కు అనుసంధానం చేసే ఫార్మ్ b 6 లో వంద శాతం సాధించిన దేశాయిపేట, ఖిలా వరంగల్ BLO లకు
కలెక్టర్ ప్రశంస పత్రాలను అందించి అభినందించారు

ఈ కార్యక్రమం లో అదనపు కలెక్టర్ శ్రీ వాత్స, RDo మహేందర్, స్వీప్ నోడల్ అధికారి నర్సింహా మూర్తి, వివిధ శాఖలకు చెందిన జిల్లా స్థాయి అధికారులు, కళాశాల విద్యార్థులు పాల్గొన్నారు

Share This Post