ఓటు హక్కు వజ్రాయుధంరాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్

ఓటు హక్కు వజ్రాయుధం

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరిని ఓటరు జాబితాలో నమోదు చేయాలి

రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్

————————————-

————————————-

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు వజ్రాయుధమని, 18 సంవత్సరాలు నిండిన ప్రతీ ఒక్కరినీ ఓటరు జాబితాలో నమోదు చేయాలని రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వికాస్ రాజ్ ఆదేశించారు.

మంగళవారం ఆయన ఓటరు జాబితా రూపొందించడం, గరుడ యాప్ వినియోగంపై జిల్లాల ఎన్నికల అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో ఓటర్ల నమోదుకు జనవరి 1 తేదీ మాత్రమే ప్రామాణికంగా తీసుకునేవారని, ఈ సంవత్సరం నుంచి ప్రతీ 3 నెలలకు ఒకసారి జనవరి 1, ఏప్రిల్ 1, జూలై 1, అక్టోబర్ 1 తేదీలను సైతం ప్రామాణికంగా తీసుకుంటూ 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరికీ ఓటరు జాబితాలో చోటు కల్పించాలని అన్నారు.

ఓటర్ల జాబితాలో ఉన్న పొరపాట్లను పూర్తి స్థాయిలో సవరించాలని అధికారులను ఆదేశించారు. ఈ సంవత్సరం ఆగస్టు 4 నుంచి అక్టోబర్ 24 వ తేదీ వరకు ప్రీ రివిజన్ నిర్వహించి, నవంబర్ 9 వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల చేయాలని సూచించారు. డిసెంబర్ 8 వ తేదీ వరకు అట్టి జాబితాపై ప్రజల నుంచి అభ్యంతరాలను స్వీకరించాలని అన్నారు. రెండు శనివారాలు, ఆదివారాలు ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని డిసెంబర్ 26 వ తేదీలోగా అభ్యంతరాలను పరిష్కరించి, జనవరి 5, 2023 తేదీ వరకు తుది ఓటరు జాబితా రూపొందించాలని తెలిపారు. ఓటరు నమోదు, ఓటు హక్కు వినియోగం, ప్రాముఖ్యతపై క్షేత్ర స్థాయిలో విస్తృత ప్రచారం నిర్వహించి, అర్హులైన వారందరూ ఓటుహక్కు పొందేలా చూడాలన్నారు. ఆగష్టు1, 2022 నుంచి ఇంటింటి సర్వే నిర్వహించి ఓటర్ల వద్ద నుంచి ఆధార్ వివరాలు సేకరించాలని సూచించారు.

ఈ వీడియో కాన్ఫరెన్స్ కు జిల్లా నుండి అదనపు కలెక్టర్ ఎన్. ఖీమ్యా నాయక్, వేములవాడ ఆర్డీఓ వి.లీల, సంబంధిత అధికారులు హాజరయ్యారు.

Share This Post