ఓటు హక్కు విలువ తెలియజెప్పాలి.

జనగామ జనవరి 25.

ఓటు హక్కు విలువ ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ శివలింగయ్య అన్నారు.

మంగళవారం కలెక్టర్ కార్యాలయంలో జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఓటు హక్కు ఆవశ్యకతపై తెలియజేశారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్హులైన యువత ఓటు హక్కు నమోదు కు అధికారులు సహకరించాలన్నారు.
ప్రతి ఒక్కరూ స్వచ్చందంగా ఓటు హక్కు పొందే విధంగా ఓటుహక్కు విశిష్టతను తెలియజేయాలన్నారు. ఓటు హక్కు మనుషుల యొక్క ఆత్మవిశ్వాసాన్ని చాటుతుంది అన్నారు.
ఓటు హక్కు పొందటం సమాజ బాధ్యతగా గుర్తించాలన్నారు కళాశాలల్లో ఓటు హక్కు విశిష్టతను తెలియజేయాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు ఓటు హక్కు పొందేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిజ్ఞ చేస్తూ భారతదేశ పౌరులం ప్రజా స్వామ్యం పై విశ్వాసం తో మన దేశ ప్రజాస్వామ్య సంప్రదాయాలను స్వేచ్ఛ నిష్పక్షపాత ప్రశాంత ఎన్నికల ప్రభావం నిలబెడతామని మతం జాతి కులం వర్గం భాష ఎటువంటి ఒత్తిడి లకు గురి కాకుండా ఎన్నికల్లో నిర్భయంగా ఓటు వేస్తామని అధికారులతోనూ సిబ్బందితో ను ప్రతిజ్ఞ చేయించారు.
అంతకుముందు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కేంద్ర రాష్ట్ర ఎన్నికల అధికారులు, రాష్ట్ర గవర్నర్ తమిళ సై సౌందర రాజన్ లో ఓటు హక్కు పై తీసుకుంటున్న చర్యలను ప్రశంసిస్తూ ఇదే స్ఫూర్తితో మరింత ముందుకు పోవాలని ఆమె ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ భాస్కర్ అధికారులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు జిల్లా పౌరసంబంధాల అధికారి కార్యాలయం జనగామ వారిచే జారీ చేయడమైనది

Share This Post