ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి-అదనపు కలెక్టర్ రమేష్

ఓపెన్ స్కూల్ పబ్లిక్ పరీక్షలు సజావుగా నిర్వహించాలి-అదనపు కలెక్టర్ రమేష్

తెలంగాణ ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుండి జూన్ 18 వరకు నిర్వహించే పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు సజావుగా, ప్రశాంత వాతావరణంలో నిర్వహించుటకు అధికారులు సమన్వయంతో పనిచేయవలసినదిగా అదనపు కలెక్టర్ రమేష్ అధికారులకు సూచించారు. ఓపెన్ స్కూల్ లో చదువుకున్న విద్యార్థుల కోసం నిర్వహించనున్న పదవ తరగతి, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షల ఏర్పాట్లపై గురువారం కలెక్టరేట్ లోని వీడియో కాన్ఫెన్స్ హాల్ లో ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడుతూ మే 31 నుండి జూన్ 16 వరకు ఉదయం 8. 30 నుండి 11.30 గంటల వరకు జరిగే పదవ తరగతి పరీక్షలకు 553 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఇందుకోసం మెదక్ లోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల, నరపూర్ లోని బాలుర జెడ్.పి .హెచ్.ఎస్. పాఠశాల, తూప్రాన్ లోని బాలికల జెడ్.పి .హెచ్ .ఎస్.పాఠశాలను కేంద్రాలుగా ఏర్పాటు చేశామని అన్నారు. అదేవిధంగా ఈ నెల 31 నుండి జూన్ 16 వరకు ఉదయం 8. 30 గంటల నుండి 11. 30 గంటల వరకు జరిగే ఇంటర్మీడియట్ పరీక్షలకు 670 మంది విద్యార్థులు హాజరవుతున్నారని ఇందుకోసం మెదక్లోని ప్రభుత్వ బాలికల ఆపాఠశాలోలో ఏ, బి కేంద్రాలను ఏర్పాటు చేశామని అన్నారు. అలాగే నర్సాపూర్ లోఐ బాలికల జూనియర్ కళాశాల, తూప్రాన్ లోని బాలుర జెడ్.పి .హెచ్.ఎస్. పాఠశాలను కేంద్రాలుగా ఏర్పాటు చేశామని వివరించారు. సంబంధిత శాఖల సమన్వయంతో ఇటీవలనే ఇంటర్మీడియట్ పరీక్షలు ప్రశాంతంగా నిర్వహించుకున్నామని, పదవ తరగతి పరీక్షలు సజావుగా నిర్వహిస్తున్నామని, అదేమాదిరి ఓపెన్ స్కూల్ సొసైటీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న పబ్లిక్ పరీక్షలకు పూర్తి సహకారం అందించాలని కోరారు.
పరీక్ష పేపర్లను భద్రపరచుటకు, పరీక్ష అనంతరం పేపర్లను సంగారెడ్డికి తరలించుటకు 6 పోలీస్ స్టేషన్లను, 6 పోస్టాఫీసులను గుర్తించి పొలిసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. పరీక్షా కేంద్రాలను పర్యవేక్షించుటకు వన్ ఫ్లైయింగ్ స్క్వాడ్ బృందాన్ని, ఏడూ పరీక్షా కేంద్రాలకు 7 సిట్టింగ్ స్క్వాడ్ బృందాలను ఏర్పాటు చేశామన్నారు. కాగా విద్యార్థులు పరీక్షా కేంద్రానికి 5 నిముషాల ఆలస్యానికి మించి అనుమతి లేదని, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ గాడ్జెస్ కు అనుమతి లేదని రమేష్ స్పష్టం చేశారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మంచి నీటి సదుపాయం, ఓ.ఆర్.ఎస్. ప్యాకెట్లు అందుబాటులో ఉంచాలని, విద్యుత్ అంతరాయం కలగకుండా చూడాలని, సమయానుకూలంగా బస్సులు నడపాలని అధికారులకు సూచించారు. పరీక్షా కేంద్రాలకు సమీపంలో 144 సెక్షన్ అమలుతో పాటు జిరాక్స్ కేంద్రాలను మూసి వేయించేలా చూడాలని తహసీల్ధార్లకు సూచించారు.
ఈ సమావేశంలో ప్రభుత్వ పరీక్షల సహాయ కమీషనర్ రామేశ్వర్ ప్రసాద్, జిల్లా విద్యా శాఖాధికారి రమేష్ కుమార్, జిల్లా ఇంటర్మీడియట్ అధికారి సత్యనారాయణ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.

Share This Post