ఓమిక్రాస్ వ్యాధిని ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సన్నద్ధంగా ఉన్నట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ తెలిపారు

. శనివారం కొత్తగూడెం ప్రధాన ఆసుపత్రిలో వైద్య తరగతులు నిర్వహణకు అదనంగా నిర్మిస్తున్న 180 పడకల బెడ్లు నిర్మాణ పనులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓమిక్రాన్ వ్యాధి వ్యాప్తి నిరోదానికి ప్రజలు తప్పని సరిగా మాస్కులు ధరించాలని, మాస్కులు ధరించడం ద్వారా మాత్రమే వ్యాధిని నియంత్రణ చేయగలమని ప్రజలకు సూచించారు. ఓమిక్రాన్ వ్యాధి నుండి ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వ్యాన్సిన్ తీసుకోని వారు తప్పని సరిగా వ్యాక్సిన్ తీసుకోవాలని వ్యాక్సిన్ తీసుకోవడమే ఓమిక్రాన్ వంటి వ్యాధుల నుండి రక్షణ ఉంటుందని. చెప్పారు. ఓమిక్రాన్ వ్యాధి గ్రస్తులకు చికిత్సలు నిర్వహణకు భద్రాచలంలో 200 బెడ్లు, కొత్తగూడెం ఆసుపత్రిలో 100 పడకలతో ఆక్సిజన్ బెడ్లు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. వ్యాధి లక్షణాలున్న వ్యక్తులు అశ్రద్ధ చేయక తక్షణం వైద్య చికిత్సలు చేయించుకోవాలని, ఇతరులను కలవకుండా దూరంగా ఉంటూ స్వీయ నియంత్రణ పాటించాలని చెప్పారు. రానున్న సంవత్సరం నుండి వైద్య తరగతులు నిర్వహణ చేపట్టనున్నందున అదనంగా చేపట్టిన 180 పడకల బెడ్లు నిర్మాణ పనులను ప్రత్యామ్నాయ పనులతో ముమ్మరంగా చేపట్టాలని చెప్పారు. నిర్మాణంలో మెటీరియల్ కొరత రాకుండా ముందస్తుగా కావాల్సిన మెటీరియల్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని చెప్పారు. కాంట్రాక్టర్లు మరియు అధికారులు సమన్వయంతో పనులు త్వర త్వరగా పూర్తి చేయు విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. ఏజన్సీ ప్రాంతమైన మన జిల్లాకు వైద్య, నర్సింగ్ కళాశాలలు మంజూరుతో ఈ ప్రాంత ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందుబాటులోకి రానుండటం చాలా సంతోషమని చెప్పారు. అనంతరం మున్సిపాల్టీలోని 34, 2, 3, 6 మరియు 15 వ వార్డుల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. రామచంద్ర కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన పట్టణ పకృతి వనం నిర్వహణ బావుందని వాచర్లు వాసుకి, కోమలిని, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్‌ను ప్రత్యేకంగా అభినందించారు. ప్రతి ఒక్కరూ రామవరం 6వ వార్డులో ఏర్పాటు చేసిన పట్టణపకృతి వనాన్ని సందర్శించిన కలెక్టర్ బావుందని, ఈ పట్టణ పకృతి వనాన్ని ఆదర్శంగా తీసుకుని ఇతర పట్టణ పకృతి వనాలు ఇదే విధంగా తయారు చేయాలని చెప్పారు. సమీకృత మార్కెట్ నిర్మాణ పనులు వేగవంతం చేయాలని చెప్పారు. 2 వవార్డులోని చిన్నారుల పార్కు అదేవిధంగా 3, 15వ వార్డులలో నిర్మిస్తున్న వ్యర్ధాలు నిర్వహణ కంపోస్టు ఎరువులు తయారీ యూనిట్, వైకుంఠ దామం నిర్మాణ పనులతో పాటు (యానిమల్ భర్త్ కేర్ యూనిట్) జంతు జనన నియంత్రణ సంరక్షణ కేంద్రం పనులను ఈ నెల 15వ తేదీలోగా పూర్తి చేయు విధంగా చర్యలు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ఈ కార్యక్రమాల్లో ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ ముక్కంటేశ్వరావు, పర్యవేక్షకులు డాక్టర్ సరళ, మున్సిపల్ కమిషనర్ సంపత్‌కుమార్, తహసిల్దార్ రామక్రిష్ణ, డిఈ నవీన్, ఏఈ రాము, టిపిఓ ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.

 

Share This Post